మాజీ సీఎల్పీ నేత జానా రెడ్డి (Jana reddy)ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (telangana cm revanth reddy) కలిశారు. ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన సీఎంను జానారెడ్డి దంపతులు సన్మానించారు. ఇరువురు నేతలు కాసేపు మాట్లాడుకున్నారు.
Revanth Reddy met Jana Reddy : టీపీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని సోమవారం ఉదయం మార్యదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారిగా ఇంటికి విచ్చేయడంతో జానారెడ్డి దంపతులు ఆయనను ఘనంగా సన్మించారు. ఇద్దరు నాయకులు కాసేపు సంభాషించుకున్నారు.
తాజ్ మహల్ వద్ద యోగా.. క్షమాపణలు చెప్పిన మహిళా బృందం.. అసలేం జరిగిందంటే ?
కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా ఉన్న జానారెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. దీంతో ఆయనకు బదులు కుమారుడు జై వీర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నాగార్జున సాగర్ టిక్కెట్ కేటాయించింది. ఆ స్థానం నుంచి జైవీర్ గెలుపొందారు. అయితే తాజాగా సీఎం.. జానారెడ్డితో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాశమవుతోంది.
మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి గారిని ఆయన నివాసంలో మార్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డిగారు.
సీఎం గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జానారెడ్డి గారు. pic.twitter.com/QMfaE6TkUs
రేవంత్ రెడ్డి కేబినెట్ లో ప్రస్తుతం 11 మందికి చోటు దక్కింది. మరో ఆరుగురికి మంత్రి పదువులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఇటీవల మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఇందులో కీలకమైన హోం శాఖతో పాటు ఎవరికీ కేటాయించని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. అయితే తాజా భేటీ నేపథ్యంలో హోం శాఖ జానా రెడ్డికి ఇస్తారనే చర్చ మొదలైంది.
నిజమైన రైతులకే పెట్టుబడి సాయం... డిసెంబర్ చివరిలోగా ఖాతాల్లో డబ్బులు జమ.. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
ఈ విషయంపై చర్చించడానికే రేవంత్ రెడ్డి జానా రెడ్డి నివాసానికి వెళ్లారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఉన్నారు. అయితే జానా రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కినట్టు అవుతుంది. ఈ విషయంలో మిగితా జిల్లా నాయకుల నుంచి కొంత అసంతృప్తి వెలువడే అవకాశం ఉంది. పైగా ఈ ముగ్గురూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే అవుతారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తారా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మారింది.