TSPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

By Mahesh K  |  First Published Dec 11, 2023, 4:14 PM IST

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. టీఎస్‌పీఎస్‌పీ భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలతో సమీక్షా సమావేశానికి రావాలని చైర్మన్ జనార్దన్ రెడ్డిని సీఎంవో ఆదేశించినట్టు సమాచారం. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టనున్నారు.
 


హైదరాబాద్: నిరుద్యోగులకు తీపి కబురు. ఉద్యోగాల భర్తీ గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఉద్యోగాల భర్తీపై సమీక్షకు పూర్తి వివరాలతో రివ్యూ మీటింగ్‌కు రావాలని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ బీ జనార్డన్ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్‌పీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? నోటిఫికేషన్ సంబంధిత పూర్తి వివరాలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశానికి రావాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. ఈ రోజు వీటిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అటువైపుగానే అడుగులు వేస్తుందా? అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించే సమీక్షలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా ఉన్నది. ఇప్పటికే మెగా డీఎస్సీ, గ్రూప్ 1, 2 పరీక్షలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ సమావేశం జరుగుతున్నది.

Latest Videos

Also Read: Article 370: సుప్రీం తీర్పుపై జమ్ము కశ్మీర్ ప్రధాన పార్టీల నేతలు ఏమన్నారు?

టీఎస్‌పీఎస్‌పీలో పేపర్ లీక్‌లు, నోటిఫికేషన్ వచ్చాక పరీక్షలు వాయిదా పడటం వంటి అనేక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. వీటితో పోటీ పరీక్షలకు సిద్ధమైన నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తికి లోనైంది. గత ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంలో నిరుద్యోగుల అసంతృప్తి కూడా ప్రధాన పాత్ర పోషించింది. అయితే, ఈ అంశాన్ని కాంగ్రెస్ టేకప్ చేసింది. తేదీలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది.

click me!