సీబీఐ లంకెతో కేసీఆర్‌ను గిల్లుకోవచ్చని ఆరాటం..: కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి

By Mahesh K  |  First Published Feb 13, 2024, 9:53 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయమూర్తితో దర్యాప్తు చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సీబీఐ కంటె బెటర్ కదా అని అన్నారు. సీబీఐతో లంకె పెడితే.. కేసీఆర్‌ను గిల్లుకోవచ్చని బీజేపీ భావిస్తున్నదని కామెంట్ చేశారు.
 


CM Revanth Reddy: ఈ రోజు మేడిగడ్డ బ్యారేజీలో కూలిన పిల్లర్లను పరిశీలించడానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన క్యాబినెట్ మంత్రులు, ఎంఐఎం శాసన సభ్యులు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌తోపాటు బీజేపీ శాసన సభ్యులు కూడా దూరంగానే ఉన్నారు. పరిశీలన తర్వాత మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

అంతకుముందే బీఆర్ఎస్ నల్లగొండలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అంత అద్భుతమైన ప్రాజెక్టు అయితే.. ఇక్కడికి వచ్చి దాన్ని ఔన్నత్యాన్ని చెప్పడానికి బీఆర్ఎస్‌కు ఏంటి నొప్పి అని ప్రశ్నించారు. తీర్మానమే సరిగా లేకుండా.. ఆయన ఆణిముత్యం అల్లుడు హరీశ్ రావు ఎందుకు ఓటేశారు అని అడిగారు. ఈ ప్రాజెక్టుపై జరిగిన అవినీతిని దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు.

Latest Videos

బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందం ఉన్న బీజేపీ కూడా ఈ పర్యటనకు దూరంగానే ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాగా, ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. కిషన్ రెడ్డి సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేయడమేంటీ.. తాము న్యాయమూర్తితో విచారణ జరిపించడానికి నిర్ణయించామని వివరించారు. తాము సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరితే.. కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని, రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాప్తుకు ఓకే చెప్పిందని తెలిపారు. సీబీఐ కంటే న్యాయమూర్తి సారథ్యంలో దర్యాప్తు అంటే ఇంకా పారదర్శకంగా ఉంటుంది కదా అని చెప్పారు. 

Also Read: YS Sharmila: రేవంత్‌తో షర్మిల భేటీ.. వైసీపీలో కలవరం.. భారీ మూల్యం తప్పదా?

సీబీఐ ద్వారా దర్యాప్తు చేయిస్తే.. ఆ దర్యాప్తు సంస్థ కేంద్రం అధీనంలో ఉంటుంది అని రేవంత్ రెడ్డి చెప్పారు. తద్వారా బీజేపీ కేసీఆర్‌కు గాలం వేయాలని అనుకుంటున్నదని ఆరోపించారు. సీబీఐతో లంకె పెడితే కేసీఆర్‌ను గిల్లుకోవచ్చని కిషన్ రెడ్డి అనుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో పదేళ్లు మోడీ ప్రభుత్వం ఉన్నది కదా.. మరి అప్పుడు ఎందుకు కిషన్ రెడ్డి ఈ డిమాండ్ చేయలేదని ఫైర్ అయ్యారు.

click me!