పాలమూరు వెనుకబాటుకు రేవంత్ రెడ్డి ఆయన గురువు చంద్రబాబును తిట్టాలి: హరీశ్ రావు

By Mahesh KFirst Published Mar 7, 2024, 5:37 PM IST
Highlights

పాలమూరు వెనుకబాటుతనానికి చంద్రబాబు కారణం అని, కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన గురువు చంద్రబాబును తిట్టాలని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కరువుతోనూ రాజకీయాలు చేశాయని ఫైర్ అయ్యారు.
 

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. పాలమూరు వెనుకబాటు తనానికి నిందించాల్సి వస్తే రేవంత్ రెడ్డి ముందు ఆయన గురువు చంద్రబాబు నాయుడినే తిట్టాలని అన్నారు. ఎందుకంటే ఆయన పాలమూరు దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. కానీ, అభివృద్ధి చేసిందేమీ లేదని అన్నారు. అసలు పాలమూరు వెనుకబాటుతనానికి ఇటు టీడీపీ, అటు కాంగ్రెస్ పార్టీల పాలనే కారణం అని ఆరోపించారు.

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ లోపాలే పాలమూరు పాలిట శాపాలుగా మారాయని హరీశ్ రావు మండిపడ్డారు.ఈ రెండ పార్టీల వల్లే మహబూబ్ నగర్ నుంచి వలసలు పెరిగాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా పెడితే బీఆర్ఎస్ హయాంలో అవి రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయని అన్నారు. పాలమూరు పచ్చగా కావడానికి కేసీఆర్ పాలనే కారణం అని స్పష్టం చేశారు. 

పాలమూరును చంద్రబాబు దత్తత తీసుకున్నారని, కానీ, పదేళ్లు అధికారంలో ఉన్న ఆయన మార్చిందేమీ లేదని హరీశ్ రావు పేర్కొన్నారు. పాలమూరులోని కరువుతోనూ అప్పటి టీడీపీ, కాంగ్రెస్‌లు రాజకీయాలు చేశాయని ఆగ్రహించారు. కాబట్టి, రేవంత్ రెడ్డి తన పౌరుషాన్ని మాటలు, దూషణల ద్వారా కాదు.. పాలన ద్వారా చూపించాలని సవాల్ విసిరారు. తన ఎత్తు గురించి మాట్లాడటం సరికాదని, తాను కూడా ఆయన ఎత్తు గురించి మాట్లాడగలనని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచనలు చేశారు.

click me!