CM Revanth Reddy: ప్రైవేటు యూనివర్సిటీలకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడుచుకోవడం సరికాదని, యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy: ప్రైవేటు యూనివర్సిటీలకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడుచుకోవడం సరికాదని, యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుకు అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నింటిపైనా నివేదిను ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మౌళికవసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా విద్యను అందిస్తున్నాయో నివేదికను అందించాలని ఆదేశించారు.
undefined
ఇండ్ల ప్లాట్లకు రిజిష్ట్రేషను అయిన భూములను, ధరణిలో చూపించిన ప్రైవేటు యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చారని, అలాంటివాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇండ్ల స్థలాల కింద రిజిష్ఠరు అయిన, వివాదంలో ఉన్న భూముల్లో యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.
యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. సర్వ శిక్షా అభియాన్ (SSA) నిధులతో మన ఊరు-మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబధించి సమగ్రంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా జరిగిన నిధుల వినియోగంపైనా సమగ్రంగా విచారణ జరిపి, నివేదికను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. శనివారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రతి పంచాయతీకి పాఠశాల ఉండాలని, ఏ గ్రామం చిన్నదైనా, మారుమూల ఉన్నదనీ, విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడంతో మూతపడిన పాఠశాలలను తెరిపించాలని పిలుపునిచ్చారు. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగించాలని అన్నారు.
ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి మెగా డీఎస్సీ (జిల్లా సెలక్షన్ కమిటీ) నిర్వహించి ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని పాఠశాలల స్థాయిని మెరుగుపరచడమే లక్ష్యంగా మన ఊరు, మన బడి కార్యక్రమంలో మిగిలిన అన్ని పనులను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే.. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ప్రత్యామ్నాయ పరిష్కారాల కోసం ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని పది జిల్లాల్లో నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పారిశ్రామిక అవసరాల కోసం నైపుణ్యం ఆధారిత విద్య, శిక్షణను అందించడంలో ఈ విశ్వవిద్యాలయాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఆలోచనలను సేకరించడానికి గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న నైపుణ్య విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు విద్యాశాఖ, పరిశ్రమల శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీ వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ సందర్భంగా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకు ముఖ్యమంత్రి ఉచితంగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు.