సీఎం రేవంత్ రెడ్డి శనివారం విద్యా శాఖపై సమీక్ష చేశారు. విద్యా వ్యవస్థలోని సమస్యలపై చర్చించారు. అనంతరంం, విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరవాలని, అందుకు అనుగుణంగా మెగా డీఎస్సీ వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని ఆదేశించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా బడి నడవాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాల్సిందేనని అన్నారు. బడి లేని కారణంగా విద్యార్థులు చదువులకు దూరం కావొద్దని, చదువుల కోసం వేరు గ్రామాలు, పట్టణాలకు పోయే పరిస్థితులు ఉండొద్దని పేర్కొన్నారు. ఇందుకోసం మెగా డీఎస్సీ వేయాలని, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం విద్యా శాఖ పై సమీక్ష నిర్వహించారు. అందులో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలోని సమస్యలపై చర్చించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని అన్నారు. అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అలాగే, ఉపాధ్యాయుల ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లలో ఉన్న సమస్యలు, అవాంతరాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని సూచించారు. విద్యాలయాలకు పారిశ్రామిక కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు వసూలు చేయకుండా.. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు.
తెలంగాణలోని అన్ని పంచాయతీల్లో బడి ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ స్పష్ఠం చేశారు. డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం ఈరోజు విద్యాశాఖ సమీక్ష నిర్వహించారు. pic.twitter.com/3qF5CdTXHT
— Telangana CMO (@TelanganaCMO)
Also Read: DSP Nalini: ఉద్యమబాట నుంచి ఆధ్యాత్మిక మార్గం.. సీఎంను కలిశాక మాజీ డీఎస్పీ నళిని కామెంట్
కాగా, ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యవంతులను తయారు చేయాలని వివరించారు. పలు రాష్ట్రాల్లో అధ్యయనాలు చేసి ఇక్కడ కార్యచరణ రూపొందించాలని తెలిపారు. మహబూబ్ నగర్‌లో కొడంగల్‌లో ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, అలాగే, మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని సీఎం అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం శాంతి కుమారి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, విద్యా శాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.