రేవంత్ రెడ్డి క్యాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. టీఎస్‌ను టీజీగా మార్చడం, స్టేట్ ఎంబ్లమ్ మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు వంటివి చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గేయంగా జయజయహే తెలంగాణను పేర్కొంది. జీరో కరెంట్ బిల్లు కోసం తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ప్రధాని మోడీ చెప్పారు. జార్ఖండ్‌లో ఈ రోజు ఫ్లోర్ టెస్ట్ జరగనుంది.
రేవంత్ రెడ్డి క్యాబినెట్:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు :
200 యూనిట్ల ఉచిత కరెంట్‌కు కేబినెట్ ఆమోదం
రూ.500కే గ్యాస్ సిలిండర్‌కు ఆమోదం
వాహన నెంబర్ ప్లేట్లపై టీఎస్‌ను టీజీగా మార్చడానికి కేబినెట్ నిర్ణయం
రాష్ట్ర గేయంగా జయ జయహే తెలంగాణకు ఆమోదం
ఈ నెల 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు
తెలంగాణలో కులగణనకు కేబినెట్ ఆమోదం
తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నంలోనూ మార్పులు
జార్ఖండ్:
జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇలా వెళ్లిపోయారో లేదో.. బిహార్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో మకాం వేశారు. జార్ఖండ్ సీఎంగా చంపయి సోరెన్ బాధ్యతలు తీసుకున్నాక అసెంబ్లీలో బల ప్రదర్శన చేపట్టాల్సి ఉన్నది. ఇంతలో బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఎక్కడ ప్రలోభపెడుతుందోనని అధికార కూటమి జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీలో బలప్రదర్శన జరగనుంది. అందుకోసమే వారిని తిరిగి రాంచీకి తీసుకెళ్లారు. ఇంతలో బిహార్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వచ్చారు. జార్ఖండ్ అసెంబ్లీలో ఈ రోజు బలప్రదర్శన జరుగుతుంది.
బిహార్:
బిహార్ కాంగ్రెస్ పార్టీ కనీసం 18 మంది తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్‌లో వారిని ఉంచింది. బిహార్‌లో కూడా బలప్రదర్శన ఉన్నది. ఫిబ్రవరి 12వ తేదీన ఫ్లోర్ టెస్టు చేపట్టాల్సి ఉన్నది. నితీశ్ కుమార్ కూటమి మార్చిన తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తరఫున ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే, బలప్రదర్శన జరగాల్సి ఉన్నది.
aపవన్ కళ్యాణ్:
జగన్ మమ్మల్ని కౌరవులు అని అంటున్నారని, ఆయనేమో అర్జునుడిలా ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఇది కలియుగమని.. కౌరవులు, పాండవులతో పోల్చుకోవద్దని పవన్ హితవు పలికారు. తనకు పదవుల మీద ఆశలు లేవని.. అడ్డదారులు తొక్కి పదవులు సంపాదించాలని లేదన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ ఆదివారం పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధం సిద్ధం అని రాష్ట్రమంతా పోస్టర్లు ఎందుకు వేశారని ప్రశ్నించారు. సొంత చెల్లెలు షర్మిలపై వైసీపీ శ్రేణులు నీచంగా మాట్లాడుతుంటే జగన్ పట్టించుకోవడం లేదని.. అలాంటి వ్యక్తి మహిళలకు ఏం గౌరవం ఇస్తాడని పవన్ కళ్యాణ్ ప్రశించారు.
Also Read: Jharkhand: హైదరాబాద్ నుంచి రాంచీకి జార్ఖండ్ ఎమ్మెల్యేలు.. బలప్రదర్శనలో మాజీ సీఎం హేమంత్!
జీరో కరెంట్ బిల్లు:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రతి కుటుంబానికి కరెంట్ బిల్లు జీరో చేయడానికి అడుగులు వేస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అసోంలోని గువహతిలో సుమారు రూ. 11,599 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘గత పదేళ్లలో తమ ప్రభుత్వం దేశంలోని ప్రతి ఇంటికి కరెంట్ అందించే క్యాంపెయిన్ చేపట్టింది. ఇప్పుడు కరెంట్ బిల్లు జీరో చేసే పనిలో ఉన్నది. బడ్జెట్‌లో రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌న ప్రకటించాం. ఈ స్కీం కింద తొలుత ఒక కోటి కుటుంబాలు రూఫ్ టాప్ సోలార్ అమర్చుకోవడానికి సహాయం చేస్తాం’ అని ప్రధాని మోడీ తెలిపారు.