తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు :
200 యూనిట్ల ఉచిత కరెంట్‌కు కేబినెట్ ఆమోదం
రూ.500కే గ్యాస్ సిలిండర్‌కు ఆమోదం
వాహన నెంబర్ ప్లేట్లపై టీఎస్‌ను టీజీగా మార్చడానికి కేబినెట్ నిర్ణయం
రాష్ట్ర గేయంగా జయ జయహే తెలంగాణకు ఆమోదం
ఈ నెల 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు
తెలంగాణలో కులగణనకు కేబినెట్ ఆమోదం
ఖైదీల క్షమాభిక్షకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం
తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయింపు
తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నంలోనూ మార్పులు
ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం
యువతకు ఉపాధి అవకాశాలు అందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులు
నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌లో చర్చ