సీఎం హాలియా సభకు హాజరవ్వాలంటే.. అవి తప్పనిసరి.. : డీఐజీ

By AN TeluguFirst Published Apr 14, 2021, 3:10 PM IST
Highlights

కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు. బుధవారం సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ రంగనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ సభలు, సమావేశాలు, రోడ్ షోలలో తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. డీఐజీ రంగనాథ్ మాట్లాడుతూ సీఎం సభకు హాజరయ్యే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

కోవిడ్ నిబంధనల మేరకు సభ జరిగేలా ఏర్పాట్లు చేశామని ప్రజలు సహకరించాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, కవ్వింపు చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుల హెచ్చరికలు అన్ని పార్టీలకు వర్తిస్తాయి అన్నారు.

శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా, శాంతియుత వాతావరణంలో ఎన్నిక జరిగేటట్లు చర్యలు చేపట్టామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీని వినియోగిస్తున్నామని ఓటర్లను ప్రలోభపెట్టే నేతలపై నిఘా పెట్టామని డీఐజీ రంగనాథ్ పేర్కొన్నారు.

click me!