ఐటీ సెజ్‌తో జడ్చర్ల అభివృద్ధి చెందుతుంది : కేటీఆర్

By Siva KodatiFirst Published Apr 14, 2021, 2:35 PM IST
Highlights

18 లక్షల మందికి పోస్ట్ మేట్రిక్ స్కాలర్‌షిప్‌లు, డిగ్రీలో ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం గడిచిన ఆరేళ్లలో 600 కోట్లు కేటాయించామన్నారు మంత్రి కేటీఆర్

18 లక్షల మందికి పోస్ట్ మేట్రిక్ స్కాలర్‌షిప్‌లు, డిగ్రీలో ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం గడిచిన ఆరేళ్లలో 600 కోట్లు కేటాయించామన్ననారు మంత్రి కేటీఆర్. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మంత్రి ఇవాళ పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యనే అన్ని సమస్యలకు పరిష్కారమని అంబేద్కర్ చెప్పిన మాటకు అనుగుణంగా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్, మహాత్మా జ్యోతిబాపూలే స్కాలర్‌షిప్‌ల ద్వారా విదేశీ విద్య కోసం కేసీఆర్ సర్కార్ రూ.20 లక్షలు ఇస్తోందని కేటీఆర్ గుర్తుచేశారు.

సర్కార్ దావాఖానాల్లో ప్రసవం చేయించుకున్న వారికి కేసీఆర్ కిట్, మగబిడ్డ పుడితే 12 వేలు, ఆడబిడ్డ పుడితే 13 వేలు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఐటీ సెజ్‌తో జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ ఆకాంక్షించారు.

రైతు బంధుతో ఎకరానికి పది వేలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని ప్రశంసించారు. బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నామని... గురుకులాల్లో ఒక్కో విద్యార్ధిపై రూ.25 వేలు ఖర్చు పెడుతున్నామని కేటీఆర్ వెల్లడించారు. 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. 

click me!