చివరిరోజు చండీయాగం... పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం దంపతులు (వీడియో)

Published : Jan 25, 2019, 02:58 PM ISTUpdated : Jan 25, 2019, 03:02 PM IST
చివరిరోజు చండీయాగం... పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం దంపతులు (వీడియో)

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో గత నాలుగు రోజులుగా సహస్ర చండీ యాగాన్ని ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ యాగం ఇవాళ్టితో పూర్తి కానుంది. చివరి రోజైన ఇవాళ మొత్తం 8 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు , కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు . రాజశ్యామల మంటపం , బగలాముఖి మంటపం , నవగ్రహ, ఋగ్వేద , యజుర్వేద , సామవేద అధర్వణ వేద మంటపాలలో తొలుత పూర్ణాహుతి జరిగింది . ఈ 8  మంటపాలలో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ప్రధాన యాగశాల అయిన చండీమాత మహా మంటపంలో పూర్ణాహుతి ప్రారంభం అయింది . 

ఉదయం యధావిధిగా ముఖ్యమంత్రి దంపతులు మొదట రాజశ్యామలాదేవి మంటపంలో పూజలు నిర్వహించారు. నమస్తత్వమే రాజశ్యామల మాతకీ జై అంటూ వేదపండితులు చేసిన మంత్రోచ్ఛరణం మధ్య పూజలు చేశారు. అక్కడ ఋత్వికులు నిర్వహిస్తున్న పూర్ణాహుతిలో పాల్గొన్నారు. 

బగలాముఖి దేవి మంటపంలో జరిగిన పూజల్లో వేదపండితులు జయ పీతాంబర ధారణి , దివ్య వేదోక్త మహా నీరాజనం సమర్పయామి అంటూ పూజలు చేశారు . నవగ్రహ మంటపంలో , మహారుద్ర మంటపంలో , చతుర్వేద మంటపాలలో కూడా పూర్ణాహుతి జరిగింది. సహస్ర శీర్షా , పురుష సంవేద పుష్పమాం , పుష్ప మాలికాం సమర్పయామి , సౌభాగ్య ద్రవ్య సమర్పయామి అంటూ పూర్ణాహుతి నిర్వహించారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

DCP Shilpavalli Statement on Koti Shooting Incident | 6Lakhs Robbery at SBIATM | Asianet News Telugu
IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!