కేటీఆర్ సీఎం అనగానే బీఆర్ఎస్ చీలిపోయే పరిస్థితి.. ఎంఐఎంకు కరీంనగర్‌లో పోటీ చేసే దమ్ముందా?: బండి సంజయ్

By Sumanth Kanukula  |  First Published Oct 4, 2023, 2:47 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రూ. 20 వేల కోట్ల అభివద్ది పనులు ప్రారంభించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రూ. 20 వేల కోట్ల అభివద్ది పనులు ప్రారంభించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. జాతీయ రహాదారులు, రైల్వే లైనులు నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తుందని‌ ప్రజలకి తెలిసిందేనని చెప్పారు. మోదీని ప్రపంచ దేశాలు ఒక హీరోలా చూస్తున్నాయని అన్నారు. దేశ ప్రధాని మీద బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల అజయ్ రావు, ట్విట్టర్ టిల్లు నిలవెత్తు విషం చిమ్ము తున్నారని అన్నారు. 

తెలంగాణలో నలుగురు మాత్రమే బాగుండాలని కొరుకుంటున్నారని బీఆర్‌ఎస్‌పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. వేరే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. మోదీ పర్యటన తర్వాత ప్రగతిభవన్‌లో భూకంపం వస్తుందని అన్నారు. మోదీ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడితే కేసీఆర్ కుటుంబంలో లొల్లిలు మొదలయ్యాయని అన్నారు. 

Latest Videos

మోదీ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయని.. కేటీఆర్ ముఖ్యమంత్రి అనగానే బీఆర్ఎస్ పార్టీ చీలి పొయే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. కేటీఆర్ సీఎం అయితే ఎలా భరిస్తమని ఎమ్మెల్యేల లొల్లిలు షురూ అయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టడానికి కేటీఆరే కారణమని విమర్శించారు. కేటీఆర్ బాష సరిగా లేదని.. తాము తిట్టడం షురూ చేస్తే తట్టుకోలేరని అన్నారు. కర్ణాటక ఎన్నికలకు డబ్బులు ఇవ్వడానికి బీఆర్ఎస్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పటీ ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులు చెప్పే ధైర్యం కేసీఆర్ కుటుంబానికి ఉందా? అని ప్రశ్నించారు.  

తెలంగాణ ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉన్నారని.. కేసీఆర్ కుటుంబం మాత్రం దేశ వ్యాప్తంగా పెట్టుబడి పెట్టె స్థాయికి‌ ఎదిగిందని విమర్శించారు. నలుగురు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. నలుగురి అవినీతి గురించి మాట్లాడితే మోదీపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లో లేదు.. గల్లిలో లేదని విమర్శలు గుప్పించారు. అసలు బీఆర్ఎస్ ‌ఏ కూటమిలో ఉందని ప్రశ్నించారు. 

2009లో ఎన్డీయే ర్యాలీలో కేసీఆర్ పాల్గొన్నది నిజం కాదా?.. ఆరోజు ఆయనను ఏ పిచ్చి కుక్క కరిచిందంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 15 రోజుల నుంచి కేసీఆర్ కనబడతలేడని, ఇనబడుతలేడని.. అలా జరగడం  తనను ఆందోళనకు గురిచేస్తుందని సెటైర్లు వేశారు. కేసీఆర్ దగ్గరకు ఎవరినీ వెళ్లనీయడం లేదని.. అఖరికి ఎంపీ సంతోష్‌రావును కూడా దూరం పెట్టారని ఆరోపించారు. కేసీఆర్‌ను కేటీఆర్ ఇబ్బంది పెడుతుండని‌ అనుమానం ఉందని అన్నారు. కేసీఆర్ కనబడితే క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. నిజామాబాద్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఇదిలాఉంటే.. మసీదు అభివృద్ధి చెస్తే తమకేమి అభ్యంతరం లేదని.. హిందు దేవాలయాలు ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. ఒక‌ మతానికి  కొమ్ము కాస్తే కచ్చితంగా మాట్లాడుతానని చెప్పారు. ఎనిమిది ఎకరాల స్థలాన్ని ఈద్గా కి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మసీదులలో నమాజ్ తరువాత బండి‌సంజయ్‌కు ఓటు వేయద్దని చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు.  తన ఆఫీసుపై ఎంఐఎం దాడి చేస్తే పోలీసులు ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. 

కరీంనగర్‌లో ఎంఐఎం పార్టీకి పోటీ చేసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ అంటేనే డబ్బులు తీసుకొని కంప్రమైజ్ అయ్యే పార్టీ అని విమర్శించారు. బీజేపీ లేకుంటే.. కరీంనగర్‌ను ఎంఐఎం పార్టీ ఖబ్జా చేసుకుంటదని అన్నారు. 

click me!