తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టులో పిటిషన్..

By Sumanth Kanukula  |  First Published Dec 29, 2021, 2:14 PM IST

తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టులో (Telangana High Court) పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలను సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. 


ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగసభలపై నిషేధం విధించింది. పబ్లిక్ ఈవెంట్స్‌లో భౌతికదూరం తప్పనిసరి చేసింది. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే తాజాగా తెలంగాణ సర్కార్.. New Year celebrationల మీద విధించిన ఆంక్షలను కొంతవరకు సడలించింది. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటల వరకు Liquor shops తెరిచి ఉంచేందుకు అనుమతిచ్చింది. బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఈవెంట్‌లు ఉదయం 1 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. అయితే కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టులో (Telangana High Court) పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలను సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంక్షలు పెట్టాలని హైకోర్టు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషన్‌లో తెలిపారు. ప్యాండమిక్ ఎపిడమిక్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌లను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. తెలంగాణలో 62 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసి ఆంక్షలు పెట్టాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్‌ను రేపు(గురువారం) విచారిస్తామని హైకోర్టు తెలిపారు. 

Latest Videos

undefined

Also raed: మందుబాబులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గం.ల వరకు మద్యం షాపులకు అనుమతి..

ఇక, కొద్ది రోజుల కిందట.. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా వేడుకలను నియంత్రించాలని స్పష్టం చేసింది.  జనం గుమిగూడకుండా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. అయితే తాజాగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతించింది. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇక, దేశంతో పాటుగా, తెలంగాణలో కూడా ఒమిక్రాన్ కేసులతో పాటుగా, కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించడం, బ్యాన్ చేయడం చేస్తున్నారు. 

click me!