
సీఎం కేసీఆర్ రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకుంటానని ప్రజల తరపున కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తన మొక్కును తీర్చుకునేందుకు ఆయన మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక విమానంలో తిరుమలకు వెళ్లనున్నారు.
రాత్రి తిరుమలలోనే బస చేసి బుధవారం తెల్లవారుజామున స్వామివారి సేవలో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన సాలగ్రామహారం, కంఠాభరణాలను తిరుమలేషుడికి సమర్పిస్తారు.
కేసీఆర్‌తోపాటు కొందరు మంత్రులు కూడా ఆయనతో పాటో మరో విమానంలో తిరుపతి చేరుకోనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం తిరుమల చేరుకుంటారు.
కాగా, సీఎం, ఆయన కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ, శ్రీవత్సం విశ్రాంతి గృహాల్లో, మంత్రులకు శ్రీ, లైలావతి, మణిమంజరి విశ్రాంతి గృహాల్లో బస ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.