15 నుంచి రంగంలోకి కేసీఆర్‌.!  తొలి సభ అక్కడి నుంచే..

By Rajesh Karampoori  |  First Published Oct 11, 2023, 12:17 AM IST

బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఆ రోజు 15న తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించి.. అనంతరం అభ్యర్థులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమయంలోనే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అదే రోజున హుస్నాబాద్‌ నిర్వహించనున్న సభలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గాల పర్యటనలు షురూ చేయనున్నారు. 


తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అన్ని రాజకీయ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంలో నానా తంటాలు పడుతుంటే.. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసి.. దూకుడు మీద ఉంది.  ముచ్చెటగా మూడోసారి అధికార పగ్గాలను చేజిక్కించుకోవాలని అధికార బీఆర్ఎస్ భారీ వ్యూహా రచన చేస్తోంది. 

ఈ క్రమంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అదే రోజు తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించనున్నారు. అనంతరం అభ్యర్థులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ తరుణంలో బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అయితే.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ నెల 15 నుండి నవంబర్ 9 వరకు సీఎం కేసీఆర్ విస్త్రుతంగా పర్యటించనున్నారు. 

Latest Videos

సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. అంతకుముందు 2014, 2018 ఎన్నికల సమయంలో కూడా హుస్నాబాద్ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు 2023లోనూ ఇదే ఆనవాయితీని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు హుస్నాబాద్ నుండి తన ప్రచారాన్ని మరోసారి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వరుసగా మూడవసారి బీఆర్ఎస్ అజేయ పరంపరను కొనసాగిస్తామని దీమా వ్యక్తం చేస్తుంది. ః

ఈ క్రమంలో సీఎం కేసీఆర్..  వచ్చే 17 రోజులలో ప్రతిరోజూ కనీసం రెండు లేదా మూడు నియోజకవర్గాలను కవర్ చేయాలని భావిస్తున్నారు. అక్టోబరు 15న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టున్నారు. అనంతరం 16న జనగాం, భోంగిరి నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.అక్టోబర్ 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు. అలాగే.. అక్టోబర్ 18న జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్  పాల్గొనే విధంగా ప్రణాళికలు సిద్దం చేశారు. 

కాస్తా విరామం తర్వాత .. అక్టోబర్ 26న  అచ్చంపేట, నాగర్‌కర్నూల్, మునుగోడు నియోజకవర్గాల పర్యటించి.. ప్రచారాన్ని పునఃప్రారంభించనున్నారు. అక్టోబరు 27న పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల సభల్లో కేసీఆర్ ప్రసంగిస్తారు. అక్టోబర్‌ 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో పర్యటించగా.. అక్టోబర్‌ 30న జుక్కల్‌, బాన్సువాడ, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటారు. అక్టోబర్ 31న హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో సమావేశాలు.

నవంబర్ 1న సత్తుపల్లి, యెల్లందు నియోజకవర్గాల్లో పర్యటించనున్న కేసీఆర్ నవంబర్‌ 2న నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. నవంబర్‌ 3న భైంసా(ముధోలు), ఆర్మూర్‌, కోరుట్ల నియోజకవర్గాల్లో సభల్లో ప్రసంగిస్తారు. నవంబర్ 5న కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాలు, నవంబర్ 6న గద్వాల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

నవంబర్ 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించి, నవంబర్ 8న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికల ప్రచారం తొలి స్పెల్ ముగియనుంది. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్, అదే రోజు కామారెడ్డిలో నిర్వహించనున్న  బహిరంగ సభలో పాల్గొన్ననున్నారు. 

సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌:

అక్టోబర్ 15: హుస్నాబాద్

అక్టోబర్ 16: జనగాం, భోంగిరి

అక్టోబర్ 17: సిద్దిపేట, సిరిసిల్ల

అక్టోబర్ 18: జడ్చర్ల, మేడ్చల్

అక్టోబర్ 26: అచ్చంపేట్, నాగర్ కర్నూల్, మునుగోడు

అక్టోబర్ 27: పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్

అక్టోబర్ 29: కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

అక్టోబర్ 30: జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్

అక్టోబర్ 31: హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ

నవంబర్ 1: సత్తుపల్లి , యెల్లందు

నవంబర్ 2: నిర్మల్, బాల్కొండ , ధర్మపురి

నవంబర్ 3: భైంసా (ముధోల్), ఆర్మూర్ , కోరుట్ల

నవంబర్ 5: కొత్తగూడెం, ఖమ్మం

నవంబర్ 6: గద్వాల్, మక్తల్, నారాయణపేట

నవంబర్ 7: చెన్నూరు, మంథని, పెద్దపల్లి

నవంబర్ 8: సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి

నవంబర్ 9: గజ్వేల్, కామారెడ్డి
 

click me!