ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ నేడు మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో అమలు చేయనున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి ప్రణాళికను వివరించనున్నారు.
ఎన్నికల సమరానికి భారత రాష్ట్ర సమితి (BRS) సంసిద్దమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత , సీఎం కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ లో అభ్యర్థులకు బీఫారం అందించనున్నారు. మొత్తం 119 మంది అభ్యర్థుల్లో 114 మందితో కూడిన జాబితాను ఎన్నికలకు ముందే ప్రకటించారు. పార్టీ అభ్యర్థులు బి ఫారంలతో పాటు పార్టీ అధ్యక్షుడి ఆశీస్సులు పొందేందుకు పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అభ్యర్థులు బారులు తీరుతున్నారు.
మేనిఫెస్టోలో ప్రాధ్యానతనిచ్చేవి..
undefined
అదే సమయంలో పార్టీ మ్యానిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. వచ్చే ఐదేండ్లలో అమలు చేయనున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి ప్రణాళికను వివరించనున్నారు. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే రైతులకు కూడా పలు కీలక హామీలను ఇవ్వనున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను చేసిన టిఆర్ఎస్ సర్కార్.. రాజు ఎన్నికలలో ఎలాంటి మ్యానుఫ్యాక్చర్ విడుదల చెయ్యబోతుందని అటు రాజకీయ విశ్లేషకులాలతోపాటు సామాన్య జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12: 15 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేయనట్లు తెలుస్తుంది. ఈ మానిఫెస్టో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా ఉంటుందని ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేనిఫెస్టోలో రైతుబంధు ఆసరా పింఛన్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల సాయం పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తే రైతుబంధు పథకం ద్వారా ప్రస్తుతం ఏడాదికి ఎకరానికి 10000 రూపాయలు ఇస్తుండగా దానిని 12 వేల రూపాయలకు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ వైద్యంపై కూడా దృష్టి పెట్టాలని, ఇందులో భాగంగా కెసిఆర్ కిట్ కింద అందించే ఆర్థిక సహాయాన్ని పన్నెండు వేల నుండి 15వేల రూపాయలకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే నిరుద్యోగ యువతను ఆకర్షించే విధంగా నిరుద్యోగ భృతిని కూడా అమలు చేయబోతున్నామని హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ
అనంతరం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టున్నారు. దాదాపుగా పార్టీ సీనియర్ నేతలందరికీ బహిరంగ సభను దిగ్విజయంగా నిర్వహించే బాధ్యతను అప్పగించారు. ఆదివారం నాటి సభ ఏర్పాట్లను సీనియర్ నేత, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పర్యవేక్షించారు. తన నియోజకవర్గం నుంచి మళ్లీ ప్రచారాన్ని ప్రారంభించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సతీష్ కుమార్.. సభకు లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. సభ సజావుగా జరిగేలా పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత భారీ బలగాలను మోహరించి అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు.
అక్టోబరు 16న జనగాం, భోంగీర్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, ఆ తర్వాత 17, 18 తేదీల్లో సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అలాగే.. కాంగ్రెస్ నుంచి వైదొలిగి బీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానం అందుకున్న టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.