మోడీని నమ్ముకొంటే శంకరగిరిమాన్యాలే: అసెంబ్లీలో కేసీఆర్

By narsimha lodeFirst Published Mar 12, 2020, 4:32 PM IST
Highlights

రాష్ట్రానికి కేంద్రం నుండి సహకారం అందడం లేదని  తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పారు. మోడీని నమ్ముకొంటే శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందేనని ఆయన ఎద్దేవా చేశారు.

హైదరాబాద్:  రాష్ట్రానికి కేంద్రం నుండి సహకారం అందడం లేదని  తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తేల్చి చెప్పారు. మోడీని నమ్ముకొంటే శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందేనని ఆయన ఎద్దేవా చేశారు.

Also read:ఈ అభివృద్ధి భట్టి విక్రమార్కకు కనిపించడం లేదా: లెక్కలతో చెప్పిన హరీశ్

గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్  కేంద్రం నుండి తెలంగాణకు నిధులు రాని విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 3 వేల 900 కోట్లు పెట్టినా కూడ ఇవ్వలేదన్నారు సీఎం.బీజేపీ సర్కార్ తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. 

ఇప్పటికైనా బీజేపీ తన నీచపు బుద్దిని మానుకోవాలని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలన సరిగా లేదని ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ 50 ఏళ్ల పాటు పోరాటం చేసిందన్నారు. 

రాష్ట్రాల  నుండి పన్నులు వసూలు చేసేందుకే కేంద్రం ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు సీఎం. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు కలిగిన నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రమే భరించాలని ఆయన సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వం  ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ  ఎన్ని చెప్పినా కూడ ప్రజలు వినే పరిస్థితి లేదన్నారు. ప్రతి ఎన్నికల్లో  కూడ తమ పార్టీనే ప్రజలు గెలిపిస్తున్న విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. 

click me!