నేటినుంచి సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేస్తున్నారు. ఎర్రవల్లిలోని ఆయన ఫార్మ్ హౌజ్ లో ఈ యాగం జరుగుతుంది. ఎన్నికల్లో విజయం సాధించడానికి యాగం సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని సమాచారం.
సిద్దిపేట : నేటి నుంచి మూడు రోజులపాటు ఎర్రవల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభతో కలిసి రాజ్యశ్యామల యాగంలో పాల్గొంటారు. బుధవారం నాడు తెల్లవారుజామున విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి పర్యవేక్షణలో యాగ సంకల్పంతో రాజేష్ శ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు.
ఈ రాజ శ్యామల యాగానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు హాజరుకానున్నారు. రాజ శ్యామల యాగం రెండో రోజు వేద పారాయణాలు జరుగుతాయి. హోమం, తదితర క్రతువులు కూడా రెండో రోజే జరుగుతాయి. యాగం మూడో రోజు అంటే చివరి రోజు పూర్ణాహుతి ఉంటుంది. కెసిఆర్ రాజ శ్యామల యాగం నేపథ్యంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
undefined
అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తి దాడి... కేటీఆర్ ట్వీట్..
రాజశ్యామల యాగం చేసిన ప్రతీసారి కేసీఆర్ విజయం సాధించారు. ఈసారి కూడా ఆయన అదే సెంటిమెంటును ఫాలో అవుతున్నారని అంటున్నారు పార్టీ శ్రేణులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి…అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కేసీఆర్ యాగాలు నిర్వహించారు. 2015లో తొలిసారిగా.. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలంటూ చండీయాగం చేశారు. ఆ తర్వాత తెలంగాణలో రెండో దశ ఎన్నికలు జరిగిన 2018లో.. ఎన్నికలకు ముందు ఫామ్ హౌస్ లోనే కెసిఆర్ రాజశ్యామల యాగం చేశారు.
యాగానంతరం జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి అధికారాన్ని దక్కించుకుని ముఖ్యమంత్రి అయ్యారు. ఇక గత ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగం చేసిన కెసిఆర్.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సహస్ర చండీయాగం చేశారు. మరోసారి.. టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంలో కూడా ఢిల్లీలో యాగం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చేస్తున్న రాజశ్యామల యాగం కూడా అదే సెంటిమెంటు ఫాలో అవుతున్నారంటూ వినిపిస్తోంది. మూడు రోజులు జరగనున్న ఈ యాగం కోసం మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ సతీసమేతంగా ఎర్రవల్లి చేరుకున్నారు.