అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తి దాడి... కేటీఆర్ ట్వీట్..

By SumaBala Bukka  |  First Published Nov 1, 2023, 8:57 AM IST

అమెరికాలో ఓ జిమ్ లో దాడికి గురైన తెలుగు విద్యార్థి వరుణ్ కు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కావాల్సిన సహాయసహకారాలు అందిస్తామన్నారు. 


హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్థిపై దాడి కేసులో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తామని తెలిపారు. అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై స్నేహితుల సహాయంతో వరుణ్‌కు కావాల్సిన సహకారాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని.. కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు.

వరుణ్ కుటుంబసభ్యులతో తన టీం టచ్ లో ఉంటారని, కావాల్సిన సహాయం అందిస్తారని చెబుతూ..వరుణ్ పరిస్థితిపై మానసా కాపురి అనే డాక్టర్ చేసిన ట్వీట్ ను షేర్ చేశారు మంత్రి కేటీఆర్. 

Latest Videos

undefined

అమెరికాలో తెలుగు విద్యార్థి పై కత్తితో దాడి...

ఇదిలా ఉండగా, మంగళవారం అమెరికాలో ఓ తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి జరిగింది.  జిమ్ లో ఉన్న వరుణ్ అనే యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. వరుణ్ పరిస్థితి విషమంగా ఉంది. వరుణ్ తలమీద దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీనివల్ల మెదడుకు గాయం అయ్యింది. 

వరుణ్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అతనికి ఐసియులో చికిత్స చేస్తున్నారు. వరుణ్ స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లాగా గుర్తించారు. దాడికి పాల్పడింది జోర్డాన్ ఆండ్రేడ్ అనే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జిమ్ లో నిందితుడు ప్రవేశించే సమయానికి వరుణ్ మసాజ్ కుర్చీపై కూర్చుని ఉన్నాడు. వరుణ్ ను చూసి ఆండ్రేడ్ ఆందోళనకు గురయ్యాడు.

తనమీద వరుణ్ దాడి చేస్తాడని భయపడి, జేబులోని కత్తితో దాడి చేసినట్లుగా పోలీసులకు తెలిపాడు. ఈ రోజు నిందితుడు ఆండ్రేడ్ ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడి వెనుక కారణాలను వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు. 

 

click me!