అయ్యేది లేదు.. సచ్చేది లేదు: ఈటల ఎపిసోడ్‌పై తొలిసారి స్పందించిన కేసీఆర్

By Siva KodatiFirst Published Jul 24, 2021, 6:38 PM IST
Highlights

ఈటల రాజేందర్‌ వ్యవహారంపై తొలిసారి స్పందించారు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈటల రాజేందర్‌తో అయ్యేది కాదు.. పోయేది కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎపిసోడ్‌పై తొలిసారి స్పందించారు సీఎం కేసీఆర్. తనగుల ఎంపీటీసీ భర్త రామస్వామితో శనివారం రైతు బంధుపై ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్.. ఈటలది చాలా చిన్న విషయమని అన్నారు. రాజేందర్ వ్యవహారం పట్టించుకోవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. తాను 2001 నుంచి టీఆర్ఎస్‌కు మద్దతుగా పనిచేస్తున్నానని కేసీఆర్‌తో అన్నారు. ఈటల రాజేందర్‌ వెంట ఉన్నప్పుడు కూడా ఆయన తనను దూరం పెట్టేవారని చెప్పుకొచ్చారు. చాలాసార్లు మనస్తాపానికి గురయ్యానని సీఎంతో అన్నారు. దీనిపై స్పందించిన సీఎం ‘‘ఈటల రాజేందర్‌తో అయ్యేది కాదు.. పోయేది కాదంటూ’’ ఆయన వ్యాఖ్యానించారు. 

Also Read:హుజూరాబాద్ మీద దృష్టి: మహిళా ఎంపీటీసీ భర్తతో కేసీఆర్ ఫోన్ సంభాషణ

ఈ నెల 26 న హుజూరాబాద్ నియోజక వర్గం లో ని 427 మంది దళితులలో సిఎం కేసీఆర్ సమావేశం కానున్నారు అందుకు జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన ఎంపిటిసి నిరోష భర్త వాసల రామస్వామికి స్వయం గా సిఎం కేసీఆర్ మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ నెల 26 న ప్రగతి భవన్ కు రావాలని దళిత బందు పథకం గురించి నియోజక వర్గంలో అందరికి వివరించాలని ఇది ప్రపంచం లోనే పెద్ద పథకమని చెప్పారు. ప్రతి గ్రామం నుండి ఇద్దరు చొప్పున రావాలని దీనికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు.


 

click me!