ఆరు సార్లు ధర్మంగానే గెలిచా.. ఇప్పుడు నా కుడి, ఎడమలపైనే టీఆర్ఎస్ గురి: ఈటల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 24, 2021, 5:01 PM IST
Highlights

రెండేళ్లకోసారి హుజూరాబాద్‌లో యుద్ధం చేయాల్సి వస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2008, 2010లో రాజీనామా చేస్తే గొప్ప మెజార్టీతో గెలిపించారని.. ఆనాడు ప్రజలే నాకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారని ఆయన గుర్తుచేశారు

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ బీఫాంతోనే తాను గెలిస్తే మిగతా వాళ్లు ఎందుకు ఓడిపోయారని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో శనివారం ఆరో రోజు పాదయాత్ర కొనసాగించిన ఆయన మాట్లాడుతూ.. ఎందుకో రెండేళ్లకోసారి హుజూరాబాద్‌లో యుద్ధం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

2008, 2010లో రాజీనామా చేస్తే గొప్ప మెజార్టీతో గెలిపించారని.. ఆనాడు ప్రజలే నాకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారని రాజేందర్ గుర్తుచేశారు. ఆరుసార్లు గెలిచినా తాను ధర్మంగానే గెలిచానని... నాకు కుడి, ఎడమ ఎవరూ ఉండకూడదని చూస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు డబ్బు, అధికారాన్ని నమ్ముకుంటే.. తాను ప్రజలను నమ్ముకున్నానని, 2023లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరబోతోంది అని ఈటల జోస్యం చెప్పారు.

Also Read:కేసీఅర్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే.. పెగ్గు పెగ్గు కు ఒక పథకం అంటాడు.. బండి సంజయ్..

దళిత బంధు తరహా పథకం తెలంగాణ రాష్ట్రమంతా అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. ఈటల పాదయాత్రలో సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఏ ఎన్నికలొచ్చినా హామీలివ్వడం కేసీఆర్‌కు అలవాటేనంటూ ధ్వజమెత్తారు. దళితబంధు కొందరికే ఇచ్చి మోసం చేసే కుట్ర చేస్తున్నారని.. రూ.10 లక్షలు అన్ని వర్గాల పేదలకు ఇవ్వాలని సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో అంబేడ్కర్‌ విగ్రహం పెడతాం అని ఆయన స్పష్టం చేశారు.

click me!