ఎన్నికల్లో డబ్బు పంపిణీ.. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు జైలుశిక్ష

By Siva KodatiFirst Published Jul 24, 2021, 5:10 PM IST
Highlights

మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 2019 ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారన్న కేసులో భాగంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

టీఆర్ఎస్ నేత, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు కోర్టు షాకిచ్చింది. ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. 2019 ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారన్న కేసులో భాగంగా కోర్టు ఈ తీర్పు వెలువరించింది. మాలోత్ కవితపై 2019లో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు తీర్పు మేరకు రూ.10 వేల జరిమానాను చెల్లించారు ఎంపీ మాలోత్ కవిత. అదే సమయంలో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. 

మాలోతు కవిత మాజీ మంత్రి రెడ్యా నాయక్ కూతురు. తన రాజకీయ జీవితాన్ని ఆమె 2009లో ప్రారంభించారు. 2009లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె టీఆర్ఎస్ లో ఉన్నారు. బంజారా సామాజిక వర్గానికి చెందిన కవిత బద్రూ నాయక్ ను వివాహమాడారు. 

click me!