బీఆర్ఎస్ తొలి జాబితా : రాజయ్యకు మొండిచేయి.. టికెట్లు రానిది వీరికే

By Siva Kodati  |  First Published Aug 21, 2023, 3:07 PM IST

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సర్వేల్లో పనితీరు సరిగా లేని వారిని ఆయన పక్కనబెట్టారు. 


వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మంది అభ్యర్ధులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి జాబితా ప్రకటించారు. సిట్టింగ్‌లో ఏడుగురికి టిక్కెట్లు నిరాకారించారు. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, బోధ్, స్టేషన్ ఘన్‌పూర్, వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు కేసీఆర్.

వేములవాడలో చెన్నమనేని రమేశ్ బాబుకు బదులు ఇటీవల పార్టీలో చేరిన చల్మెడ ఆనందరావుకు టికెట్ ఖరారు చేశారు. ఖానాపూర్‌లో బీఆర్ఎస్ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా నాయక్ బదులుగా కేటీఆర్‌కు సన్నిహితుడైన ఎన్ఆర్ఐ జాన్సన్‌కు టికెట్ ఇచ్చారు. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కుకు బదులుగా కోవా లక్ష్మీకి టికెట్ కేటాయించారు. బోథ్‌లో సిట్టింగ్ రాథోడ్ బాపూరావుకు బదులుగా అనిల్ జాదవ్‌కు స్థానం కల్పించారు. 

Latest Videos

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్యకు బదులుగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా బండారి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు. ఖమ్మం జిల్లా వైరాలో రాములు నాయక్‌కు బదులుగా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు టికెట్ కేటాయించారు. 
 

 

click me!