
వేములవాడ : తెలంగాణ బిఆర్ఎస్ లో టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా టికెట్ దక్కనివారి జాబితాలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కూడా వున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే చెన్నమనేని ట్వీట్ మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది.
తమ కూతురు సంగీత డాక్టర్ పట్టా అందుకోవడం తల్లిదండ్రులుగా తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. తమ కుటుంబసభ్యులం అందరం ప్రస్తుతం ఎంతో సంతోషంగా వున్నామని అన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత రాజకీయాలపై స్పందిస్తూ భావోద్వేగంతో కామెంట్ చేసారు.
రాజకీయాలు ప్రజల కోసమే చేయాలని... పదవు కోసం కాదని తన తండ్రి చెప్పేవారని... ఆ మాటలను ప్రతిసారి స్మరించుకుంటానని ఎమ్మెల్యే చెన్నమనేని పేర్కొన్నారు. తన తుది శ్వాస ఉన్నంతవరకు ఈ మాటలు మరిచిపోనని... ఆ విలువలు పాటిస్తూనే రాజకీయాలు చేస్తానని అన్నారు. ఇలా తనతో వున్నవారేవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనట్లు భరోసా ఇచ్చేలా ట్వీట్ చేసారు చెన్నమనేని.
Read More ఏడుగురు సిట్టింగ్ లకు నో చాన్స్: బీఆర్ఎస్ జాబితా విడుదల చేసిన కేసీఆర్
దయచేసి నిర్ణయాలు అందరితో సంప్రదించి, అభిప్రాయాల అనుగుణంగా తీసుకోవాలని... లేదంటే ఆత్మాభిమానం దెబ్బతింటుందని అన్నారు. ప్రజల ఆమోదం లభించాలంటే అందరూ కలిసి పనిచేయాలని... ఇది తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న మొదటి పాటమని ఎమ్మెల్యే అన్నారు. ఇలా బిఆర్ఎస్ అదిష్టానానికి పరోక్షంగా హెచ్చరించినట్లుగా చెన్నమనేని కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నారు.