CM KCR : పడిలేచిన కెరటం.. ఉద్యమ నాయకుడు నుంచి పాలకుడుగా.. సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానం.. 

By Rajesh KarampooriFirst Published Nov 11, 2023, 11:46 AM IST
Highlights

CM KCR : తెలంగాణలో ఉద్యమానికి ఊపిరులూది.. రాష్ట్ర ప్రజల నరనారల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్షలు రగిలించింది మార్గదర్శి. 60 ఏళ్ల కల సహకారమయ్యేలా చేసిన ఉద్యమ మార్గదర్శి. తెలంగాణ ప్రత్యేక రాష్రం అవతరించిన తరువాత కూడా అదే స్పూర్తితో పాలనను సాగిస్తున్నారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి రెండు పర్యాయాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగారు. మరోమారు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులెత్తించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో నిలిచారు.  ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తెలియజేయాలనే చిన్న ప్రయత్నం.. 

CM KCR : ప్రత్యేక తెలంగాణ సాధనపై ఎలాంటి ఆశలు లేని సమయంలో తాను ఒక్కడిగా ప్రయాణం మొదలు పెట్టి కోట్లాది మందిని కదిలించి  రాష్ట్రాన్ని తెచ్చిన రాజనీతిజ్ఞుడు కే.చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao). ఆయన కేసీఆర్ ( KCR) గా సుపరిచితం. తన 38 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఆటుపోట్లు, అవమానాలెదుర్కున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు సాగిన ప్రయాణంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఏన్నో ఎదురు దెబ్బలు పడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో పాలకుడుగా ఆవరోధాలు ఎదుర్కొన్న ప్రతిసారి ప్రత్యార్థుల అంచాలను మించి కెరటంలా ఎగిసి పడ్డారు. తెలంగాణ అంటే కేసీఆర్ .. కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా మార్చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ప్రస్తావన లేకుండా.. చరిత్ర రాయలేం.. చెప్పలేం.. 

తెలంగాణలో ఉద్యమానికి ఊపిరులూది.. రాష్ట్ర ప్రజల నరనారల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్షలు రగిలించింది మార్గదర్శి. 60 ఏళ్ల కల సహకారమయ్యేలా చేసిన ఉద్యమకారుడు.  ప్రత్యేక రాష్రం అవతరించిన తరువాత కూడా అదే స్పూర్తితో పాలనను సాగిస్తున్నారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు.  ఇప్పటికి రెండు పర్యాయాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగారు. మరోమారు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులెత్తించాలని అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో నిలిచారు.  ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తెలియజేయాలనే చిన్న ప్రయత్నం.. 


 
రాజకీయ ప్రస్థానం

కల్వకుంట్ల చంద్రశేఖర రావు  (K. Chandrashekar Rao) 1954 ఫిబ్రవరి 17న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రాంతం చింతమడకలో జన్మించారు. రాఘవరావు, వెంకటమ్మ దంపతులు ఆయన తల్లిదండ్రులు. సొంత జిల్లాలోని ప్రాథమిక, ఉన్నత విద్య (సిద్ధిపేట డిగ్రీ కళాశాల) పూర్తి చేశారు. ఆయనకు చిన్నప్పటి నుంచే తెలుగు సాహిత్యం, భాష, రాజకీయ అంశాలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. దీంతో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో  తెలుగు లిటరేచర్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1969 ఏప్రిల్ 23న శోభను కేసీఆర్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. వారే మంత్రి కేటీఆర్ (K.T.Rama Rao) , ఎమ్మెల్సీ కవిత( Kalvakuntla Kavitha). 

రాజకీయాల్లో ఆసక్తితో  కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ తరువాతి కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పిలుపుతో తెలుగుదేశం( టీడీపీ)లో చేరారు. ఈ క్రమంలో 1983లో మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 29 ఏళ్ళకే మొదటిసారి శాసనసభకు పోటీ చేశారు. కానీ, ఆయన గురువుగా భావించే.. రాజకీయ ఉద్దండైన మదన్మోహన్ చేతిలో కేవలం 87 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అదే ఆయనకు చివరి పరాజయం తర్వాత జరిగిన ఏ ఎన్నికలలో కేసీఆర్ వెనుతిరిగి చూడలేదు. ఆ తర్వాత విజయాల పరంపర కొనసాగించారు. 

1985 ఎన్నికల్లో మరో మారు సిద్దిపేట నుంచి పోటీ చేసిన కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి పై 16,156 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి అసెంబ్లీలో కాలుపెట్టారు. 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికలతో కలిపి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఎన్టీఆర్ హయాంలో 1987-88 లో కరువు శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్.. చంద్రబాబు హయంలో కూడా మంత్రి బాధ్యతలు నిర్వహించారు.  1996లో రవాణ శాఖ మంత్రిగా  ఆ తరువాత 2000-2001 మధ్యకాలంలో ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు కేసీఆర్. 

ఆ తరువాత జరిగిన పలు రాజకీయ పరిణామాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా అడుగులేశారు. 2001లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. తన పదవిని వదులుకున్నారు. తెలంగాణ మేధావులు, ఉద్యమకారులతో సుధీర్ఘంగా చర్చించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తెర తీశారు కేసీఆర్. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్ జల దృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. కేసీఆర్ కు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలపై మంచి పట్టు ఉండటం ఆయనకు చాలా బాగా కలిసి వచ్చింది. ఆయన తన ప్రసంగాలతో తెలంగాణ ప్రజానీకాన్ని ఆకట్టుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర స్ఫూర్తిని రగిలించారు.  ఈ తరుణంలో 2004 సాధారణ ఎన్నికల్లో అటు కరీంనగర్ నుంచి ఎంపీగా.. ఇటు సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత ఎమ్మెల్యే గా రాజీనామా చేసి.. ఎంపీగా కొనసాగారు. 

అప్పటి యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ (నేటీ బీఆర్ఎస్) భాగస్వామి కావడంతో ఆయనను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా నియమించారు. అయితే.. ఆ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేదంటూ ఆ యూపీఏ కూటమి నుంచి తప్పుకున్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు.  ఆ తరువాత 2006, 2008 ఉప ఎన్నికల్లోను కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆనాటి ప్రతిపక్ష సవాళ్లతో మరోసారి ఎంపీగా రాజీనామా చేశారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా విజయం సాధించారు. ఈ తరుణంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తార స్తాయికి తీసుకెళ్లారు. మేధావులు, ప్రజల సహకారంతో తనదైన వ్యూహాలతో ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. 2009 నవంబర్ 29న తెలంగాణ సాధన కోసం ప్రారంభించిన నిరవధిక దీక్షతో రాష్ట్ర రాజకీయాలను మార్చేశారు. ఆనాటి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ ఏర్పాటు చేయించడంలో కేసీఎం సక్సెస్ అయ్యారు. చివరకు తెలంగాణ ఉద్యమం ఫలించి 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయింది. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్.. ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ను ఒంటరిగా గెలిపించారు. 

అఖండ విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండో మారు ముఖ్యమంత్రిగా సేవలందించారు.  బంగారు తెలంగాణ నినాదంతో ప్రతిష్టాత్మక లక్ష్యాలు నిర్దేశించుకుని.. సంక్షేమం అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ దేశాన్ని ఆకట్టుకుంటున్నారు. పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రుణమాఫీ, దళిత బంధు, బీసీ బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో జనం మన్ననలు పొందుతున్నారు కేసీఆర్. ఈ నెల చివరిలో  జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నియోజక వర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరోమారు తన పార్టీని గెలిపించి..  మూడోసారి ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారు కేసీఆర్.  
 

click me!