జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ భేటీ

By narsimha lodeFirst Published Nov 18, 2020, 2:48 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులతో బుధవారం నాడు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.


హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులతో బుధవారం నాడు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.

డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పోలింగ్ నిర్వహించనున్నారు.  జీహెచ్ఎంసీపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని  టీఆర్ఎస్ బాస్ భావిస్తున్నాడు.

ఈ మేరకు  టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు, టీఆర్ఎస్ శాసనసభపక్షంతో కేసీఆర్ భేటీ అయ్యారు.జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్  ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం కల్పించకుండా ఉండాలని టీఆర్ఎస్ భావిస్తోంది.ఈ క్రమంలోనే జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. 2016 ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 మంది కార్పోరేటర్లను కైవసం చేసుకొంది.

ఈ దఫా వందకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడం టీఆర్ఎస్ కు కొంత ఇబ్బందిని కల్గించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమాగా ఉంది.

click me!