హైద్రాబాద్‌లో రూ.2,679 కోట్లతో మూడు టిమ్స్ ఆసుపత్రులు: భూమి పూజ చేసిన కేసీఆర్

Published : Apr 26, 2022, 12:03 PM ISTUpdated : Apr 26, 2022, 12:53 PM IST
 హైద్రాబాద్‌లో రూ.2,679 కోట్లతో మూడు టిమ్స్ ఆసుపత్రులు: భూమి పూజ చేసిన కేసీఆర్

సారాంశం

హైద్రాబాద్ లో మూడు ట్విమ్స్ ఆసుపత్రులకు  సీఎం కేసీఆర్ మంగళవారం నాడు భూమి పూజ నిర్వహించారు. సనత్ నగర్, కొత్తపేట, అల్వాల్ లో మూడు ట్విమ్స్ ఆసుపత్రులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR మంగళశారం నాడు హైద్రాబాద్ లో మూడు TIMS  ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. కొత్తపేట, సనత్ నగర్, అల్వాల్ లో మూడు టిమ్స్ ఆసుపత్రలను  నిర్మించనున్నారు. అల్వాల్ లో 28.41 ఎకరాల్లో రూ. 897 కోట్ల వ్యయంతో జీ+ 5 అంతస్థులతో టిమ్స్ Hospital ని నిర్మించనున్నారు. Sanath Nagar లో 17 ఎకరాల్లో రూ. 882 కోట్లతో జీ+ 14  అంతస్తులతో టిమ్స్  భవనాన్ని నిర్మించనున్నారు. గతంలో Kothapetలో ఫ్రూట్ మార్కెట్ ఉన్న స్థలంలో రూ.900 కోట్లతో జీ+ 14   అంతస్థులతో టిమ్స్  ను నిర్మించనున్నారు ఒక్కో ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటు చేయనున్నారు.  మంగళవారం నాడు అల్వాల్ లో ఈ మూడు ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. రూ. 2,679 కోట్లతో ఈ మూడు ఆసుపత్రులను నిర్మించనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.