తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి అసెంబ్లీ సంతాపం తెలిపింది.
హైదరాబాద్: కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో కలపాలని సాయన్న ఎంతో పరితపించేవాడని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారంనాడు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల శాసనసభ నివాళులర్పించింది. సాయన్న మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు.
అట్టడుగు వర్గాల నుండి సాయన్నఎదిగాడన్నారు. సాయన్న లేని లోటు తీర్చలేదన్నారు. కంటోన్మెంట్ ప్రజల కోసం సాయన్న ఎంతో పరితపించేవారన్నారు. వివిధ పదవుల్లో సాయన్న సేవలందించారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. సాయన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామన్నారు.
undefined
ఏ బాధ్యత తీసుకున్న అంకిత భావంతో పనిచేసే వ్యక్తి సాయన్న అని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.సాయన్న పేదల పక్షపాతి, నిరాండబరుడన్నారు. సాయన్నను ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు.
మృధు స్వభావి ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్టుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తన నియోజకవర్గం, కంటోన్మెంట్ నియోజకవర్గం పక్క పక్కనే ఉన్నాయన్నారు. దాదాపు 30 ఏళ్లకుపైగా తాము కలిసే ఉన్నామన్నారు. ఎప్పుడూ ప్రజలతో సాయన్న కలిసి ఉండేవారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేసుకున్నారు.
సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని తనతో సాయన్న ఎప్పుడూ అనేవారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. తాను కంటోన్మెంట్ నియోజకవర్గంలో గతంలో ఉండేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా సాయన్నకు ప్రజలు ఓట్లు వేసేవారన్నారు. సాయన్న మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు.
ఐదు దఫాలు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి సాయన్న విజయం సాధించడం గొప్ప విషయమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు.సాయన్న మృతి పట్ల పలు పార్టీల ప్రజా ప్రతినిధులు ప్రసంగించారు. సాయన్న మృతి పట్ల సంతాపం తెలిపారు. అనంతరం సాయన్న మృతికి అసెంబ్లీ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విజయరామారావు మృతి పట్ల అసెంబ్లీ నివాళి తెలిపింది.అనంతరం తెలంగాణ అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి