కాంగ్రెస్‌లో చేరడం సంతోషంగా ఉంది: కేసీఆర్‌పై జూపల్లి ఫైర్

By narsimha lode  |  First Published Aug 3, 2023, 11:30 AM IST

పార్టీ నష్టపోతుందని తెలిసి కూడ  తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన  కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  ప్రజలను కోరారు.


హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీలో చేరడం  తనకు  సంతోషాన్ని కలిగించిందని  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఎఐసీసీ చీఫ్  మల్లికార్జున ఖర్గే  సమక్షంలో  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  గురువారంనాడు  కాంగ్రెస్ పార్టీలో  చేరారు.  ఈ సందర్భంగా  ఆయన  మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో  తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందని  జూపల్లి కృష్ణారావు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఏ ఆశయం కోసం  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ఫలితాలు  అందడం లేదని  జూపల్లి కృష్ణారావు  చెప్పారు.  

భారతదేశ చరిత్రలో  ఇంత అవినీతిమయమైన సీఎం ఎవరూ లేరని ఆయన  కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందన్నారు.  కేసీఆర్ పాలనను చూసి  బాధగా ఉందన్నారు.  ఏ రంగంలోకూడ ఆశించిన ఫలితాలు రాలేదన్నారు.కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంటగలిసిందని ఆయన  విమర్శలు చేశారు.  

Latest Videos

also read:కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు సహా పలువురు: కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే

ఎన్నికల్లో వేల కోట్లను పంచడానికి  ఎక్కడి నుండి వస్తున్నాయని ఆయన  కేసీఆర్ ను  ప్రశ్నించారు. విపక్ష కూటమికి తనను నాయకుడిగా నియమిస్తే  ఎన్నికల ఖర్చును భరిస్తానని  కేసీఆర్ ప్రకటించినట్టుగా  సాగిన  ప్రచారంపై  కూడ జూపల్లి కృష్ణారావు  ప్రస్తావించారు. ఏ వ్యాపారాలు చేయకుండా  ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయని ఆయన  కేసీఆర్ ను  ప్రశ్నించారు.రాజకీయ వ్యవస్థను  భ్రష్టుపట్టించారని  కేసీఆర్ పై జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.  9 ఏళ్ల పాటు సెక్రటేరియట్ కు  వెళ్లని సీఎం ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.

click me!