Suryapet: సూర్యాపేటలో నూతనంగా ప్రారంభించిన మార్కెట్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అక్కడి రైతు రైతులు, కూరగాయలు విక్రయిస్తున్న వారితో ముచ్చటించారు. వారి పరిస్థితులు గురించి ఆరా తీశారు. మార్కెట్‌లో రైతులతో మాట్లాడిన సీఎం వారు పండిస్తున్న పంటల గురించి, సాగు ద్వారా వచ్చే ఆదాయాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు.
CM KCR interacts with farmers in Suryapet: సూర్యాపేటలో నూతనంగా ప్రారంభించిన మార్కెట్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అక్కడి రైతు రైతులు, కూరగాయలు విక్రయిస్తున్న వారితో ముచ్చటించారు. వారి పరిస్థితులు గురించి ఆరా తీశారు. మార్కెట్‌లో రైతులతో మాట్లాడిన సీఎం వారు పండిస్తున్న పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. సాగు ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేటలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చూట్టారు. ఈ క్రమంలోనే స్థానికంగా నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయలు-మాంసం మార్కెట్‌లో విక్రేతలతో ముచ్చటించారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం హెలికాప్టర్‌లో సూర్యాపేట మార్కెట్‌కు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఇంధన శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్వాగతం పలికారు. మార్కెట్‌లో రైతులతో మాట్లాడిన కేసీఆర్ వారి పంటలను అడిగి తెలుసుకున్నారు. సాగు ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు.
సూర్యాపేట జిల్లాలో నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. pic.twitter.com/Rk8u7N7hKd
మార్కెట్ విక్రేతలతో ముచ్చటించిన అనంతరం సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాల భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. మల్లాపూర్‌లో నూతనంగా నిర్మిస్తున్న వైకుంఠ ధామాన్ని ఆయన సందర్శించారు.
సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. pic.twitter.com/IuTSFUBg5t
ఆ తర్వాత ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రసంగించే ముందు కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను కూడా ప్రారంభించారు. "సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, నూతన పోలీసు కార్యాలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారని" సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, నూతన పోలీసు కార్యాలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ రాజేంద్ర ప్రసాద్ ను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు… pic.twitter.com/HzKGt98N0L