కొండకల్‌లో మేధా రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Published : Jun 22, 2023, 04:12 PM IST
కొండకల్‌లో మేధా రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

సారాంశం

Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కొండకల్ లో మేధా రైలు కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ కార్మికులతో మాట్లాడుతూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక అనుబంధ పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయనీ, స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు-ఉపాధి అవకాశాలు వచ్చాయని చెప్పారు.  

KCR inaugurates Medha rail coach factory: రంగారెడ్డి జిల్లా కొండకల్ లో మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ప్రయివేటు రైల్వే బోగీలు, కోచ్ ల తయారీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గురువారం ప్రారంభించారు. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం, రైల్వే రోలింగ్ స్టాక్ స్విస్ తయారీ సంస్థ స్టాడ్లర్ రైల్ రాష్ట్రంలో రైల్ కోచ్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ కార్మికులతో మాట్లాడుతూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక అనుబంధ పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయనీ, స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు-ఉపాధి అవకాశాలు వచ్చాయని చెప్పారు.

 

 

భారతదేశంలో అతిపెద్ద ప్రయివేటు కోచ్ ఫ్యాక్టరీగా చెప్పబడే ఈ కర్మాగారం దేశీయంగా తయారు చేసిన మేధా సెర్వో డ్రైవ్స్ ప్రయివేటు లిమిటెడ్, స్టాడ్లర్ రైల్ మధ్య ఉన్న జాయింట్ వెంచర్. సుమారు 25 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 160 బోగీలను రైల్వే శాఖకు సరఫరా చేయడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రెండు వందే భారత్ రైళ్లకు సంబంధించిన విడిభాగాలను కూడా తయారు చేస్తోంది. కాగా, అంతకుముందు కొల్లూరులో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం రూ.2 కోట్లతో నిర్మించిన 1489బీహెచ్ కే హౌసింగ్ కాలనీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

 

 

పటాన్ చెరు పట్టణంలో రూ.184 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని ఈ ప్రాంతాల్లోని పరిశ్రమల అవసరాలను తీర్చడానికి ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vande Bharat Sleeper Train : హైదరాబాద్ టు డిల్లీ లగ్జరీ ట్రైన్ జర్నీ.. వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలివే
IMD Cold Wave Alert : చలి నుండి ఉపశమనం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్లీ గజగజలాడించే చలి, పొగమంచు ఎక్స్ట్రా