ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి.. పేదల చూపు సర్కారీ దవాఖానాల వైపే : నిరంజన్ రెడ్డి (వీడియో)

Siva Kodati |  
Published : Jun 22, 2023, 03:50 PM ISTUpdated : Jun 22, 2023, 03:51 PM IST
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి.. పేదల చూపు సర్కారీ దవాఖానాల వైపే : నిరంజన్ రెడ్డి (వీడియో)

సారాంశం

కేసీఆర్ కిట్ రాకతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఒకే రోజు 28 కాన్పులు అభినందనీయమన్న ఆయన.. సగటున నెలకు 450 కాన్పులు జరుగుతున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వైద్యరంగం బలోపేతమైందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 257 మంది లబ్దిదారులకు రూ.79.48 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు మంత్రి. అలాగే వనపర్తి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి ఒకే రోజు 28 కాన్పులు చేసిన వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలను అభినందించారు నిరంజన్ రెడ్డి. అనంతరం 28 మంది శిశువుల తల్లులకు కేసీఆర్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్యరంగం మీద తమ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టిందన్నారు. కేసీఆర్ కిట్ రాకతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఒకే రోజు 28 కాన్పులు అభినందనీయమన్న ఆయన.. సగటున నెలకు 450 కాన్పులు జరుగుతున్నాయన్నారు. ఇవి గతంలో 50 , 60 అయితే ఎక్కువన్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో వైద్యసిబ్బంది సేవలు బాగున్నాయని నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ వైద్య సేవల వైపు మొగ్గు చూపుతున్నారని అక్కడ లభిస్తున్న సేవలపై సంతృప్తిగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నిరంజన్ రెడ్డి తెలిపారు. 

ఆపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన లవ్ వనపర్తి, లవ్ తెలంగాణ సింబల్స్‌ను నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu
Revanth Reddy vs KTR | రేవంత్ రెడ్డి vs కేటిఆర్ డైలాగ్ వార్ | Asianet News Telugu