ఇళ్ల ఓపెనింగ్: కత్తెర మరిచిన అధికారులు.. కోపంతో రిబ్బన్ పీకిపారేసిన కేసీఆర్ (వీడియో)

By Siva KodatiFirst Published Jul 4, 2021, 7:09 PM IST
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం ఆదివారం తన పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండేపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటి గృహ ప్రవేశానికి అంతా రెడీ కాగా, వేద మంత్రాల మధ్య లబ్ధిదారులతో సహా కేసీఆర్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ప్రాంతానికి వస్తుంటే హడావిడి మామూలుగా వుండదు. ఆయన పర్యటనకు వారం రోజుల ముందే సీఎం వెళ్లాల్సిన ప్రదేశం భద్రతా దళాల గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. ఇక ట్రయల్ రన్‌లు, అలాగే కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ప్రతిరోజూ ఏర్పాట్లను పరిశీలిస్తుంటారు. ఏదైనా ప్రారంభోత్సవం వుంటే ఆ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటారు. అలాంటిది సీఎం రిబ్బన్ కట్ చేయడానికి కత్తెర కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ఈ అనుభవం ఎదురైంది ఎవరికో కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి.

వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం ఆదివారం తన పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండేపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటి గృహ ప్రవేశానికి అంతా రెడీ కాగా, వేద మంత్రాల మధ్య లబ్ధిదారులతో సహా కేసీఆర్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా గుమ్మానికి అడ్డంగా రిబ్బన్ కట్టి అధికారులు సర్వం సిద్ధం చేశారు. తీరా కత్తెర కనిపించకపోవడంతో సీఎం కాసేపు వేచి చూశారు. ఇదే సమయంలో ఎంతకు కత్తెర రాకపోవడంతో కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తనే చేతితో రిబ్బన్‌ను పీకి పడేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి నూతన గృహంలోకి అడుగుపెట్టారు

 

"

click me!