కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..

Published : Sep 12, 2022, 02:21 PM ISTUpdated : Sep 12, 2022, 02:24 PM IST
కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..

సారాంశం

తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ యేడాది వెలువడిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో ప్రభుత్వం అందరికీ ఒకే కటాఫ్ ను నిర్థారించింది. 

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత కోసం అన్ని కేటగిరీలకు 60 మార్కులను కటాఫ్ గా నిర్ణయించింది. దీంతో, ప్రతిపక్ష నేతలు, కొందరు అభ్యర్థులు కటాఫ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేవారు. ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కటాఫ్ మార్కులు తగ్గేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Health: ఉచితంగా కంటి ప‌రీక్షల శిబిరం.. నెల‌రోజుల పాటు అవ‌కాశం, ఎక్క‌డంటే.?
పెళ్లి చేసుకోరు కానీ ఒకే రూమ్‌లో క‌లిసి ఉంటారు.. ఫుడ్డు, బెడ్డు అంతా వాళ్ల‌దే. హైద‌రాబాద్‌లో కొత్త క‌ల్చ‌ర్