ఉద్యమ కాలంలో నేతల బూట్లు మోసింది ఎవరో.. తెలంగాణ కోసం గొంతెత్తింది ఎవరో గుర్తుచేసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో చూపిన చైతన్యాన్ని మునుగోడు ప్రజలు మళ్లీ చూపాలని .. ధన బేహార్‌లను తరిమికొట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
50 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేకపోయిందని దుయ్యబట్టారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా మునుగోడులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఉద్యమ కాలంలో నేతల బూట్లు మోసింది ఎవరో.. తెలంగాణ కోసం గొంతెత్తింది ఎవరో గుర్తుచేసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మునుగోడుకు ఇచ్చిన హామీలను నెరవేర్చామని సీఎం తెలిపారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ లేదని.. కానీ తెలంగాణలో ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు.
పూటకో పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు వుండవని.. డబ్బు మదంతో పనిచేసే వాళ్లకు బుద్ధి చెప్పాలని సీఎం పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయితే శివన్నగూడెం ప్రాజెక్ట్‌కు నీళ్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలో చూపిన చైతన్యాన్ని మునుగోడు ప్రజలు మళ్లీ చూపాలని .. ధన బేహార్‌లను తరిమికొట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల వరి పండుతోందని.. రాష్ట్రంలో రేషన్ కార్డులందరికీ సన్నబియ్యం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
ALso Read: ప్రాజెక్ట్‌లు ఆపిందెవరు .. వలసల వనపర్తిని, వరి పంటల వనపర్తిగా చేసిన మొనగాడెవరు : కేసీఆర్ వ్యాఖ్యలు
కాంగ్రెస్ వస్తే కర్ణాటకలో ఏం జరిగిందో చూస్తున్నామని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే నీటిగోస తీరిందని సీఎం అన్నారు. ఒకప్పుడు ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు పడుతున్న బాధను చూసి తానే పాట రాశానని కేసీఆర్ గుర్తుచేశారు. అప్పుడు బూట్లు మోసినవాళ్లు ఇప్పుడు నాకు ఛాలెంజ్‌లు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.