గవర్నర్ తమిళిసైకి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

Siva Kodati |  
Published : Jun 02, 2022, 08:57 PM IST
గవర్నర్ తమిళిసైకి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

సారాంశం

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుడి ఆశీస్సులతో మరెన్నో ఏళ్ల పాటు ప్రజా సేవలో కొనసాగాలంటూ ఆయన ఆకాంక్షించారు.   

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్‌ల (kcr) మధ్య గత కొన్నినెలలుగా గ్యాప్ పెరిగిన సంగతి తెలిసిందే. దీనిపై స్వయంగా గవర్నర్ తమిళిసై కూడా స్పందించారు. అయినప్పటికీ ప్రగతి భవన్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో తమిళిసై సౌందరరాజన్ పుట్టిన రోజు (Tamilisai Soundararajan Birthday) సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తమిళిసైకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం లేఖ పంపారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు.. దేవుడి ఆశీస్సులతో మీరు మరిన్ని సంవత్సరాలపాటు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు.. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదిక ద్వారా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తన జన్మదిన వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌‌భవన్‌లో కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఈ రాష్ట్రం నాది.. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్‌ను మాత్రమే కాదు.. మీ సహోదరిని అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు సేవ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు అవకాశం కల్పించారని తమిళిసై అన్నారు. రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినా.. తాను బాధపడను.. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు నా సేవలను అందిస్తూనే ఉంటానని తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. 

ALso Read:Tamilisai Birthday: మీరే నేటి యువతకు ఆదర్శమూర్తి: గవర్నర్ తమిళిసై కి పవన్ భర్త్ డే విషెస్

కాగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రభుత్వానికి మధ్య గత కొన్ని రోజుల నుంచి సఖ్యత లేని విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ సైతం ప్రభుత్వంపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రులు కూడా ఆమెపై పలు వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇది గవర్నర్‌, గవర్నమెంట్ మధ్య ఉన్న గ్యాప్‌ను మరింత పెంచినట్లు కనిపించింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్.. వ్యక్తిగతంగా తనను అవమానించినా, రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి మర్యాద ఇవ్వాలని సూచించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్