Chandrayaan-3: అంత‌రిక్ష రంగంలో భార‌త్ స‌రికొత్త అధ్యాయం.. చంద్రయాన్-3 విజయంపై సీఎం కేసీఆర్ హర్షం

By Mahesh Rajamoni  |  First Published Aug 24, 2023, 2:59 AM IST

Chandrayaan 3: చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజ‌యంతంగా దిగింది. చంద్రుడిపై అమెరికా, చైనా, పూర్వపు సోవియట్ యూనియన్ తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించింది. చారిత్రాత్మక చంద్ర‌యాన్-3 మిష‌న్ విజ‌య‌వంత‌మైన‌ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సంబారాలు అంబరాన్నంటాయి. ల్యాండింగ్ కార్యక్రమాన్ని ఇస్రో తన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌డంతో కోట్లాది మంది లైవ్ వీక్షించారు.
 


Chandrayaan 3 Moon Landing: చంద్ర‌యాన్-3 మిష‌న్ విజ‌య‌వంతం కావ‌డంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి, భార‌త్ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) హ‌ర్షం వ్య‌క్తంచేశారు. బుధ‌వారం భార‌త ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజ‌యంతంగా దిగింది. చంద్రుడిపై అమెరికా, చైనా, పూర్వపు సోవియట్ యూనియన్ తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించింది. చారిత్రాత్మక చంద్ర‌యాన్-3 మిష‌న్ విజ‌య‌వంత‌మైన‌ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పార్టీలు, ప్రార్థనలు ఘనంగా జరిగాయి. ల్యాండింగ్ కార్యక్రమాన్ని ఇస్రో తన వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌డంతో కోట్లాది మంది లైవ్ వీక్షించారు.

చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ ను చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ చేయడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హర్షం వ్యక్తం చేశారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ మాడ్యూల్ ను విజయవంతంగా ఉంచిన తొలి దేశంగా భారత్ అవతరించిందని కేసీఆర్ తెలిపారు. ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ కొత్త అధ్యాయాన్ని లిఖించి కొత్త చరిత్రను సృష్టించింద‌న్నారు. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సందర్భం ఇదని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలు, సిబ్బందితో పాటు అంతరిక్ష ప్రయోగం విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ముఖ్యమంత్రి అభినందించారు.

Latest Videos

భారతీయులందరికీ ఇది పెద్ద సెలబ్రేషన్ డే అనీ, చిరకాల స్వప్నం ఈ రోజు నెరవేరిందని సీఎం కేసీఆర్ అన్నారు. చంద్రయాన్ 3 విజయం అంతరిక్ష పరిశోధనలకు, ఇస్రో చేపట్టబోయే మరిన్ని ప్రయోగాలకు గొప్ప ఉత్తేజాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఇస్రో తన విజయగాథలను కొనసాగించాలనీ, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసి కొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

'సేఫ్ లాండింగ్' అనే చివరి ఘట్టాన్ని కూడా పూర్తిచేయడం ద్వారా ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

చంద్రుని దక్షిణ ధృవం మీదకు ల్యాండర్ మాడ్యూల్ ను చేర్చిన మొట్టమొదటి దేశంగా, ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో… pic.twitter.com/YQLNtxh1kK

— Telangana CMO (@TelanganaCMO)

కాగా, ఇస్రో మూడవ చంద్ర మిషన్ చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్ విజయవంతంగా ల్యాండ్ అయింది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భార‌త్ నిలిచింది.  ప్ర‌స్తుతం చంద్ర‌యాన్-3 విక్ర‌మ్ ల్యాండ‌ర్ జాబిల్లిపై దిగిన నాలుగు గంట‌ల త‌ర్వాత విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి రోవ‌ర్ ప్ర‌గ్యాన్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాల‌ను భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ఇస్రో పంచుకుంది. ఈ ప్ర‌గ్యాన్ రోవ‌ర్ చంద్రుని ఉప‌రిత‌లంపై తిరుగుతూ అక్క‌డి ప‌రిస్థితుల‌ను, సంబంధిత దృశ్యాల‌ను ఇస్రోకు పంపించ‌నుంది. చంద్రునిపై ప్ర‌గ్యాన్ రోవ‌ర్ సెక‌నుకు సెంటీమీట‌ర్ చొప్పున ముందుకు క‌దులుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే చంద్రునిపై భార‌త ముద్ర నాలుగు సింహాలు, ఇస్రో చిహ్నాన్ని అక్క‌డి ఉప‌రిత‌లంపై ముంద్ర వేయ‌నుంది.

click me!