మర్రిమిట్ట ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి..

By AN TeluguFirst Published Jan 29, 2021, 3:25 PM IST
Highlights

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించడం మీద తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద లారీ - ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. 

వివరాల్లోకి వెడితే.. రోడ్డు మీద వెడుతున్న ఆటోను అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులంతా గూడూరు మండలం ఎర్రకుంట్ల తండాకు చెందిన వారే. అంతేకాదు వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. 

మహబూబాబాద్ లో బట్టలు కొనుక్కుని వరంగల్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. వాళ్లు ఎక్కిన ఆటో గూడూరు శివార్లకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జు నుజ్జయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వాళ్లంతా అక్కడిక్కడే చనిపోయారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. 

మృతుల్లో ఇటీవలే పెళ్లి కుదిరిన యువతి కూడా ఉన్నట్లు సమాచారం. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ యువతి పెళ్లికి బట్టలు కొనేందుకు వెల్తుండగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. 

ప్రమాదంలో లారీ కిందికి వెళ్లిపోయిన ఆటోను పోలీసులు అతికష్టమ్మీద బైటికి తీశారు. దీనికోసం లారీని ప్రొక్లెయిన్‌తో పక్కకు నెట్టారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే లారీ అతివేగంగా రావడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

click me!