పోలీస్ శాఖలో మార్పొచ్చింది.. రావాల్సింది రెవెన్యూ విభాగంలోనే: కేసీఆర్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 12, 2020, 5:19 PM IST
Highlights

కొత్త రెవెన్యూ వ్యవస్థతో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజాసంక్షేమం కోసమే కొత్త చట్టాన్ని తీసుకొచ్చామన్న ఆయన.. శనివారం తనను కలిసిన రెవెన్యూ ఉద్యోగులు, సర్వీసు సంఘాల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు

కొత్త రెవెన్యూ వ్యవస్థతో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజాసంక్షేమం కోసమే కొత్త చట్టాన్ని తీసుకొచ్చామన్న ఆయన.. శనివారం తనను కలిసిన రెవెన్యూ ఉద్యోగులు, సర్వీసు సంఘాల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు.

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్త  చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూ శాఖ పనిచేయాలని సూచించారు. రెవెన్యూ యంత్రాంగం ప్రజల్లో ఒక నమ్మకం కల్పించాలని, పోలీస్ శాఖలో వచ్చిన మార్పులాగే, రెవెన్యూ శాఖలోనూ మార్పు రావాలని కోరారు సీఎం.

Also Read:కొత్త రెవిన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల్లో ప్రమోషన్లు ఉంటాయన్న సీఎం.. తహసీల్దార్లకు రెగ్యులర్‌గా కారు అలవెన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. ఇక తహసీల్దార్ ఆఫీసుల్లో సౌకర్యాల కోసం రూ.50 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు.

వీఆర్వోలకు ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు కల్పిస్తామన్నారు. వయో భారం వున్న వీఆర్‌వోల పిల్లలకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. రెవెన్యూ ఆఫీసులకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని.. రెవెన్యూ చట్టానికి ఎవరూ అతీతం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు.

వీఆర్ఏలకు స్కేల్‌తో ప్రభుత్వంపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతుందని .. త్వరలోనే సీసీఎల్‌ఏ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 

click me!