కరోనా గుడ్ న్యూస్:హైదరాబాదీ కంపెనీ ముందంజ, కోతులపై వాక్సిన్ సక్సెస్

By team telugu  |  First Published Sep 12, 2020, 5:04 PM IST

భారతదేశం నుండి కరోనా వైరస్ వాక్సిన్ తయారీలో ముందువరుసలో పోటీ పడుతున్న కంపెనీల్లో భరత్ బయోటెక్ కూడా ఒకటి. ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్, భరత్ బయోటెక్ లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ కోవాక్సిన్ ట్రయల్స్ ను దేశంలో 12 చోట్ల నిర్వహిస్తున్నారు. 


కరోనా వైరస్ కి వ్యతిరేకంగా తాము తాయారు చేసిన కోవాక్సీన్ జంతువుల్లో ఇమ్యూనిటీని(రోగ నిరోధక శక్తి) గణనీయంగా  పెంచిందని హైదరాబాద్ కు చెందిన ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ ప్రకటించింది. 

భారతదేశం నుండి కరోనా వైరస్ వాక్సిన్ తయారీలో ముందువరుసలో పోటీ పడుతున్న కంపెనీల్లో భరత్ బయోటెక్ కూడా ఒకటి. ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్, భరత్ బయోటెక్ లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ కోవాక్సిన్ ట్రయల్స్ ను దేశంలో 12 చోట్ల నిర్వహిస్తున్నారు. 

Latest Videos

undefined

కోతుల్లో ఈ వాక్సిన్ ఇచ్చిన తరువాత కరోనా వైరస్ కి వ్యతిరేకంగా యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయని, కోతుల ముక్కు, నోటిలో ఈ వైరస్ కణాలు గణనీయంగా తగ్గాయని, శరీరంలో వైరస్ కణాల వ్యాప్తి గణనీయంగా తగ్గినట్టు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. 

ఇకపోతే ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ ట్రయల్స్ కి తాత్కాలిక బ్రేకులు పడ్డ విషయం తెలిసిందే. భారతదేశంతో పాటు ఇతర దేశాలలో ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ పై నిలిపివేతపై బయోకాన్ చైర్‌ పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఈ వ్యాక్సిన్‌ను త్వరితంగా అభివృద్ధి చేయలేమని తేలిందని మజుందార్ షా తెలిపారు. సురక్షితమైన వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మాత్రమే ఆమోదం లభించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. 

"వైద్య, శాస్త్రీయ ప్రపంచంలో ప్రతిఒక్కరూ మాట్లాడుతున్న విషయం ఇదే అని అన్నారు. టీకా పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలి. 

వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడు ప్రతి తీవ్రమైన ప్రతికూలతను పరిశోధించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఆరోగ్యకర వ్యక్తులపై టీకాలు వేస్తారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి "అని కిరణ్ మజుందార్ అన్నారు.

ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను కొన్ని సమస్యల కారణంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలో పరీక్షలకు అనుమతి పొందిన సీరం సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తాజా ఆదేశాల మేరకు పరీక్షలను నిలిపివేసింది. 

క్లినికల్ ట్రయల్స్ లో సమస్యల కారణంగా బ్రిటన్, భారతదేశంతో పాటు ఇతర దేశాలలో అంతరాయం ఏర్పడిన కారణంగా కిరణ్ మజుందార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

click me!