నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్: 80,039 ప్రభుత్వ ఉద్యోగ పోస్టుల భర్తీ

Published : Mar 09, 2022, 10:37 AM ISTUpdated : Mar 09, 2022, 12:14 PM IST
నిరుద్యోగులకు కేసీఆర్  గుడ్ న్యూస్: 80,039 ప్రభుత్వ ఉద్యోగ పోస్టుల భర్తీ

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో  త్వరలోనే 80,039 ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ బుధవారం నాడు ఈ ప్రకటన చేశారు. 

హైదరాబాద్: త్వరలోనే  రాష్ట్రంలోని 80,039 ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి  ఇప్పటి వరకు 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ సీఎం KCR  బుధవారం నాడు Telangana Assembly  వేదికగా కీలక ప్రకటన చేశారు.  

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 91,147 ఉన్నాయని సీఎం చెప్పారు. అయితే ఇందులో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించగా మిగిలిన 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

పోలీస్ శాఖలో 18,334, విద్యాశాఖలో 13,086, వైద్య, ఆరోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యా శాఖలో 7,878, రెవిన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో 4,311, గిరిజన సంక్షేమ శాఖలో 2,399, సాగునీటి శాఖలో 2,692  పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ్టి నుండే ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్  జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

మైనారిటీ శాఖలో 1,825,అటవీశాఖలో 1598,పంచాయితీరాజ్ శాఖలో 1455,కార్మిక శాఖలో 1221,ఫైనాన్స్ శాఖలో 1146, మున్సిఫల్ శాఖలో 859, వ్యవసాయ శాఖలో 801, రవాణ శాఖలో 563 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం చెప్పారు.న్యాయ శాఖలో 386,సాధారణ పరిపాలన శాఖలో 343,పరిశ్రమల శాఖలో 233, పర్యాటక శాఖలో 184, సచివాలయం, హెచ్ఓడీ, వర్శిటీల్లో 8,147 ఖాళీలున్నాయని సీఎం వివరించారు.

ఇక గ్రూప్- 1లో 503,గ్రూపు 2లో 582, గ్రూప్ 3లో1373, గ్రూప్ 4 లో9168, జిల్లా స్ధాయి లో 39,829,జోనల్ స్థాయిలో 18866,మల్టీజోన్ లో13170, అదర్ కేటగిరిలో వర్సిటీలలో 8174 భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

ఇక జిల్లాల వారీగా ఈ కింది విధంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 
హైదరాబాద్ – 5,268
నిజామాబాద్- 1,976
మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769
రంగారెడ్డి- 1,561
కరీంనగర్- 1,465
నల్లగొండ- 1,398
కామారెడ్డి- 1,340
ఖమ్మం- 1,340
భద్రాద్రి కొత్తగూడెం- 1,316
నాగర్‌కర్నూల్- 1,257
సంగారెడ్డి- 1,243
మహబూబ్‌నగర్- 1,213
ఆదిలాబాద్- 1,193
సిద్దిపేట- 1,178
మహబూబాబాద్- 1,172
హనుమకొండ- 1,157
మెదక్- 1,149
జగిత్యాల- 1,063
మంచిర్యాల- 1,025
యాదాద్రి భువనగిరి- 1,010
జయశంకర్ భూపాలపల్లి- 918
నిర్మల్- 876
వరంగల్- 842
కుమ్రం భీం ఆసీఫాబాద్- 825
పెద్దపల్లి- 800
జనగాం- 760
నారాయణపేట్- 741
వికారాబాద్- 738
సూర్యాపేట- 719
ములుగు- 696
జోగులాంబ గద్వాల- 662
రాజన్న సిరిసిల్లా- 601
వనపర్తి- 556
 

ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఉద్యోగ నియమాకాలను చేపడుతామని కేసీఆర్ చెప్పారు.  పోలీస్ శాఖ మినహాయించి అన్ని ఉద్యోగాలకు అభ్యర్ధుల వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నామని కేసీఆర్ తెలిపారు. ఓసీలకు 44 ఏళ్లు ,ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లకు వయో పరిమితి పెంచుతున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది  దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టమన్నారు. Hyderabad తొలుత ఒక దేశంగా, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఉందన్నారు. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉందన్నారు.  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో తాను 9వ తరగతి విద్యార్ధిగా పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నానని కేసీఆర్ చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్ధిగా మీరు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష, అన్యాయాలతో తెలంగాణ నలిగిపోయిందన్నారు. 

వేరే పార్టీలకు రాజకీయాలంటే గేమ్ అని చెప్పారు.  కానీ రాజకీయాలంటే తమకు ఓ టాస్క్ అని  కేసీఆర్ చెప్పారు.  వ్యక్తిగతంగా కూడా తనను కూడా నిందించారన్నారు. అయితే చిల్లర గాళ్లని అని వదిలేశానని చెప్పారు. 

నీళ్లు, నిధులు, నియమాకాలే తమ ఉద్యమ ఎజెండా అని కేసీఆర్ గుర్తు చేశారు.  నీళ్లు కూడా తెచ్చుకొన్నామన్నారు. ఇంకా కూడా తెలంగాణ వాటా సాధించుకొనే వరకు పోరాటం చేస్తామన్నారు. గోదావరి జలాలను ఇప్పటికే సాధించుకొన్నామని చెప్పారు. నీటిో వాటాల కోసం పోరాటం చేస్తామన్నారు.

విద్యుత్ ఉద్యోగస్తుల పంచాయితీ Supreme Court కు చేరిందన్నారు. 9,10 షెడ్యూల్‌ సంస్థల్లోని ఉద్యోగుల విభజన ఇంకా తెగలేదని సీఎం చెప్పారు. Andhra Pradesh అర్ధరహితమైన పంచాయితీ  పెడుతున్నారన్నారు. అగ్రికల్చర్ యూనివర్శిటీలో కూడా తమకు వాటా కావాలని ఏపీ కోరుతున్నారన్నారు.

1.56 లక్షల ఉద్యోగాలను నోటిఫై చేశామన్నారు కేసీఆర్. ఇప్పటి దాకా 1.30 లక్షల పోస్టులను భర్తీ చేసినట్టుగా సీఎం కేసీఆర్ వివరించారు. ముల్కీ రూల్స్ స్పూర్తితో శాశ్వత ప్రాతిపదికన 95 శాతం ఉద్యోగాలు స్థానికులు పొందేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెప్పారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జీవోలను ఇచ్చినట్టుగా కేసీఆర్ చెప్పారు. అటెండర్ పోస్టు నుండి ఆర్డీఓ పోస్టు వరకు స్థానికులకే ఉద్యోగాలు దక్కుతాయన్నారు.   సెక్రటేరియట్ మినహా అన్ని విభాగాల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి ఏపీలో 20 శాతం నాన్ లోకల్ కోటా ఉండేదన్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu