సీఎం కప్ -2023 @ రూ. 3.60 కోట్లు..  లోగో, మస్కట్ లను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Published : May 14, 2023, 06:32 AM ISTUpdated : May 14, 2023, 07:13 AM IST
సీఎం కప్ -2023 @ రూ. 3.60 కోట్లు..  లోగో, మస్కట్ లను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

సారాంశం

CM Cup-2023: సీఎం కప్-2023ను విజయవంతం చేయాలని, ఈ క్రీడల నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ. 3 కోట్ల 60 లక్షలు మంజూరు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీఎం కప్ విజయవంతం చేయడానికి వివిధ కమిటీలను నియమించాలని మంత్రి సూచించారు.  

CM Cup-2023: తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర కీడ్రా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023ను విజయవంతం చేయాలని, ఈ క్రీడల నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ. 3 కోట్ల 60 లక్షలు మంజూరు చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  సీఎం కప్ - 2023 నిర్వహణలో భాగంగా టోర్నీ లోగో, మస్కట్ లను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, SATS చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారితో కలిసి ఆవిష్కరించారు.  
 
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా సీఎం కప్-2023ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో 2 లక్షల మంది విద్యార్థులను భాగస్వామ్యం చేసి భవిష్యత్తు క్రీడాకారులుగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. మన రాష్ట్రం నుంచి దేశానికి గొప్ప క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా సీఎం కప్ - 2023 ను పగడ్బందీగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో (నూతనంగా 76) క్రీడా మైదానాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామనీ, ఇప్పటికే రాష్ట్రంలో 50 శాతం స్టేడియాలను పూర్తి చేశామని తెలిపారు. సీఎం కప్ నిరంతరం కొనసాగేలా విధి విధానాలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. క్రీడాకారులకు, కోచ్ లకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. గత ఒలంపిక్స్, కామన్వెల్త్ క్రీడలలో తెలంగాణకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనపర్చారని తెలిపారు. 

CM Cup - 2023 విజయవంతం చేయడానికి తెలంగాణ ఒలంపిక్ అసోసి యేషన్, వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్లు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATS) ఉన్నతాధికారులు కీలక భూమిక పోషించాల న్నారు. నిర్వహణ లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అధికారులను హెచ్చరించారు.18 క్రీడాంశాల్లో ఈ నెల 15 నుంచి 17 వరకు మండల స్థాయిలో, మే 22 నుంచి 24వరకు జిల్లా స్థాయిలో, మే 28 నుంచి 31 రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. 

విజయం సాధించే క్రీడాకారులకు  1,00,000 రూపాయల నగదు బహుమతి, రన్నర్స్ కి రూ.75 వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, సాట్స్ ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. 29న జరిగే సీఎం కప్ ఉత్సవాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ విజయవంతం చేయడానికి వివిధ కమిటీ లను నియమించాలని ఆదేశించారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. సీఎం కప్ నిరంతరం నిర్వహించేలా విధివిధానాలను రూపొందించాలని మంత్రి క్రీడా శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సాట్స్ ఓ ఎస్ డి డాక్టర్ కే లక్ష్మి, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్, జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, సాట్స్ ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, అనురాధ, దీపక్, డాక్టర్ హరికృష్ణ, అర్జున అవార్డు JJ శోభ, ములిని రెడ్డి, అనుప్, క్రీడా అవార్డు గ్రహీతలు, వివిధ క్రీడా సంఘాల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోచ్ లు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?