తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు.. 21 రోజుల పాటు వేడుకలు : కేసీఆర్

Siva Kodati |  
Published : May 13, 2023, 09:26 PM ISTUpdated : May 29, 2023, 12:17 PM IST
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు.. 21 రోజుల పాటు వేడుకలు : కేసీఆర్

సారాంశం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్న సందర్శంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.  జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఈ వేడుకలు నిర్వహిస్తారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్న సందర్శంగా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వేడుకల నిర్వహణపై సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. దీనికి గాను సీఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఈ వేడుకలు నిర్వహిస్తారు. 

ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకునేందుకు గాను ‘‘మార్టియర్స్ డే’’ను జరపనున్నారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా వున్న అమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించనున్నారు. అలాగే జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేస్తారు. అమరులకు నివాళిగా పోలీసులు గాల్లోకి తుపాకీ పేల్చి వందనం సమర్పిస్తారు. జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  అలాగే 20 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిని డాక్యుమెంట్‌గా ప్రదర్శించనున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?