కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కొత్తగా కేసులు నమోదు చేయవద్దని కూడా తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూమ్ అంశంలో అన్ని ఎఫ్ఐఆర్‌లను ఒకే కేసుగా పరిగణించాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ వార్ రూమ్ కేసును తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారించింది. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు తీవ్రమైన చర్యలు కూడా తీసుకోవద్దని కూడా హైకోర్టు కోరింది. తెలంగాణ గళం పేరుతో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. తదుపరి విచారణను ఈ ఏడాది మార్చి 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు తెలిపింది.
హైద్రాబాద్ మాదాపూర్ లో కాంగ్రెస్ వార్ రూమ్ లో 2022 డిసెంబర్ 13వ తేదీన పోలీసులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదుల ఆదారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల సోదాలపై కాంగ్రెస్ నేతలు కూడా హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
undefined
also read:కాంగ్రెస్ వార్ రూమ్ కేసు: మల్లు రవికి పోలీసుల నోటీసులు
కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ విషయంలో తనకు సంబంధం లేదని సునీల్ కనుగోలు గతంలో హైకోర్టుకు తెలిపారు. పోలీసుల విచారణలో కూడా ఇదే విషయాన్ని సునీల్ చెప్పారు. కాంగ్రెస్ వార్ రూమ్ కు తాను ఇంచార్జీగా ఉన్నట్టుగా ఆ పార్టీ నేత మల్లు రవి సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు మల్లు రవికి ఈ కేసు విషయమై నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు మల్లు రవి హజరైన వషయం తెలిసిందే.