ఈ నెల 16న ఆదిలాబాద్ నుండి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 16వ తేదీ నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పాదయాత్ర ప్రారంభించి ఖమ్మం జిల్లాలో పాదయాత్రను ముగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవమరాల ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నుండి ఇటీవలనే మహేశ్వర్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్లు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ నుండి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నారు. . ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు పాదయాత్రను భట్టి విక్రమార్క ప్లాన్ చేసుకున్నారు. పాదయాత్ర ముగింపును పురస్కరించుకని భారీ బహిరంగ సభను కూడా నిర్వహించనున్నారు.
undefined
హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగుతుంది. గత నెల 6వ తేదీన రేవంత్ రెడ్డి మేడారం నుండి పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగుతుంది. మరో కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి యాత్ర హైద్రాబాద్ వైపునకు సాగుతుంది.
నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాదయాత్ర ను ప్రారంభించనున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాదయాత్ర నిర్వహించనున్నట్టుగా ప్రకటించారు. పార్టీ నేతలంతా పాదయాత్రలు నిర్వహించాలని మాణిక్ రావు ఠాక్రే తేల్చి చెప్పారు. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో పార్టీ కార్యాలయాలు, ఇళ్ల వద్ద ఉండొద్దని పార్టీ నేతలకు ఠాక్రే చెప్పారు. దీంతో నేతలు పాదయాత్రలకు సిద్దమౌతున్నారు.
also read:ఈ నెల 9న కరీంనగర్ లో కాంగ్రెస్ సభ: ఛత్తీస్ ఘడ్ సీఎం భగేల్ రాక
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. పార్టీ నేతల మద్య ఉన్న విబేధాలను పరిష్కరించేందుకు మాణిక్ రావు ఠాక్రే ప్రయత్నాలు చేపట్టారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభంచి నెల రోజులు దాటింది. ఈ నెల 9వ తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. ఈ సభకు ఛత్తీస్ ఘడ్ సీఎం కూడా హజరుకానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభంచి నెల రోజులు దాటింది. ఈ నెల 9వ తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. ఈ సభకు ఛత్తీస్ ఘడ్ సీఎం కూడా హజరుకానున్నారు.