కేసీఆర్ హయంలో బడ్జెట్ లో పని దినాలు తగ్గాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రేపటి నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ప్రజల సమస్యలను లేవనెత్తుతామన్నారు.
హైదరాబాద్: కేసీఆర్ హయంలో అసెంబ్లీలో బడ్జెట్ పని దినాలు తగ్గాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారంనాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్, ప్రభుత్వానికి మద్య వివాదం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు పరిధి దాటినప్పుడే ఇలాంటి సమస్యలు వస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న
సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని ప్రభుత్వం పై అసెంబ్లీ సాక్షిగా ఒత్తిడి తీసుకువస్తామని ఆయన చెప్పారు.
హత్ సే హత్ జోడో అభియాన్ కింద పాదయాత్రల నిర్వహణల గురించి ఎల్లుండి సమావేశమై చర్చించనున్నట్టుగా భట్టి విక్రమార్క చెప్పారు. తనను ఎక్కడి నుండి పాదయాత్ర నిర్వహించాలని పార్టీ ఆదేశిస్తే అక్కడి నుండి పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు.