మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు.. లెక్కలు చెప్పాలి కదా.. అప్పులంటూ కేంద్రంపై అవాస్తవ ఆరోపణలే: కేసీఆర్‌పై ఈటల ఫైర్

By Mahesh KFirst Published Feb 2, 2023, 4:22 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తున్నదని, అవన్నీ వట్టి అవాస్తవాలని ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చని, అన్నింటికీ లెక్కలు ఉంటాయని, వాటిని మాట్లాడాలని అన్నారు. అప్పు చేయడానికి పద్ధతి ఉంటుందని తెలిపారు.
 

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. మాటలు కోతలు ఎన్నైనా కోయవచ్చునని, కానీ, ప్రతి మాటకు లెక్క ఉండాలి కదా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం వంద లక్షలకోట్లు అప్పు చేసిందని అవాస్తవ ఆరోపణలు చేస్తున్నదని పేర్కొన్నారు. మాటలు చెప్పొచ్చు కానీ, లెక్కలు కూడా చెప్పాలి కదా అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టా రీతిన అప్పులు చేస్తున్నదని అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అప్పులు ఒక పద్ధతి ప్రకారం చేస్తారని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లోని సానుకూలాంశాలను ఏకరుపెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

చాలా రాష్ట్రాలు ఎన్నికల సంవత్సరంలో ఓట్లే లక్ష్యంగా బడ్జెట్ పెడుతుంటాయని, కానీ, కేవలం మోడీ ప్రభుత్వం మాత్రమే ప్రలోభ పెట్టే బడ్జెట్ పెట్టలేదని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో మాయలు, మభ్యలు లేవని, ఇది ప్రాక్టికల్ బడ్జెట్ అని వివరించారు. 4 శాతం ఉన్న ద్రవ్యోల్బణం కరోనా కాలంలో 9.5 శాతానికి పెరిగిందని, ఇప్పుడు దాన్ని 6.2 శాతానికి తెచ్చారని తెలిపారు. మళ్లీ దాన్ని 4 శాతానికి తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని వివరించారు. 

Also Read: మసీదులు తవ్వడం కాదు.. దమ్ముంటే కాలువలు తవ్వుదాం రా: బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ ఫైర్

కేసీఆర్ ప్రభుత్వం వట్టి మాటలు చెప్పడం కాదని, దమ్ముంటే తాను చెప్పే అంశాలపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 2014, 15 కాలంలో జీఎస్‌డీపీలో మన రాష్ట్ర అప్పు 15 శాతంగా ఉన్నదని, అది 2021,22 కాలంలో 28.8 శాతం అంటే డబుల్ అయిందని వివరించారు. అదే కేంద్రం అప్పు మాత్రం 2014, 15లో 50.1 శాతం ఉన్న అప్పు 2019,20 కాలంలో 48.7 శాతానికి తగ్గిందని తెలిపారు.

ఎన్‌సీడీసీ, ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డు ఇవన్నీ కేంద్రం ఇచ్చే అప్పులే కదా అని అన్నారు. కేసీఆర్ 1.05 లక్షల గ్యారంటీ రుణాలు తెచ్చారని, 3.83 వేల కోట్ల ఎఫ్ఆర్‌బీఎం అప్పులు తెచ్చారని వివరించారు. మొత్తం 5 లక్షల కోట్ల అప్పు చేశారని, రాష్ట్ర జనాభాతో పోలిస్తే.. ఇక్కడ ప్రతి మనిషిపై రూ. 1.2 లక్షల అప్పు చేశారని తెలిపారు. అత్యధిక ద్రవ్యోల్బణ రాష్టర్ం తెలంగాణ అని, పాలనలో సీఎ కేసీఆర్ అధపాతాళంలో ఉన్నారని వివరించారు.

click me!