డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలనకు బ్రేక్: వెనుదిరిగిన కాంగ్రెస్

By narsimha lode  |  First Published Sep 18, 2020, 5:48 PM IST

 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం నాడు అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాగారం మున్సిపాలిటీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో కార్యక్రమం నిలిచిపోయింది. 


హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం నాడు అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాగారం మున్సిపాలిటీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో కార్యక్రమం నిలిచిపోయింది. హైద్రాబాద్ నగరంలోనే లక్ష ఇళ్లు చూపించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలకు ఇళ్ల లిస్ట్ ను పంపుతాను... ఆ ఇళ్లను పరిశీలించుకోవచ్చని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

also read:హైద్రాబాద్‌లో రెండోరోజు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పరిశీలన: భట్టితో కలిసి ఇళ్లు పరిశీలిస్తున్న మంత్రి తలసాని

Latest Videos

undefined

హైద్రాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. గురువారం నాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను తీసుకొని నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూపించారు.

also read:జీహెచ్ఎంసీ ఎన్నికలు: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...

ఇవాళ కూడ గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. నాగారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన తర్వాత ఈ కార్యక్రమం నుండి కాంగ్రెస్ నేతలు వైదొలిగారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఇళ్లను  పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ నేతలు ఈ పర్యటన నుండి వైదొలిగారు.

హైద్రాబాద్ లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని చూపడం సరైంది కాదని కాంగ్రెస్ నేతలు వాదించారు. హైద్రాబాద్ లోనే లక్ష ఇళ్లను చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం నుండి వైదొలిగారు. హైద్రాబాద్ లో పదివేల ఇళ్ల కంటే ఎక్కువ నిర్మించలేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలకు తాను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాబితాను పంపుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఈ జాబితా ఆధారంగా అధికారులను కూడ పంపుతామన్నారు. అధికారులను తీసుకొని ఆ ఇళ్లను పరిశీలించుకోవచ్చని మంత్రి తలసాని చెప్పారు.
 

click me!