పీసీసీ కూర్పుపై అసంతృప్తి: ఠాగూర్‌తో ఢిల్లీలో భట్టి భేటీ

By narsimha lodeFirst Published Jul 2, 2021, 12:06 PM IST
Highlights

: పీసీసీ కూర్పుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ  అధిష్టానం పిలుపుమేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం నాడు ఢిల్లీకి వెళ్లారు. 

హైదరాబాద్: పీసీసీ కూర్పుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ  అధిష్టానం పిలుపుమేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం నాడు ఢిల్లీకి వెళ్లారు. గురువారం నాడు రాత్రి సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పీసీసీ కూర్పు విషయమై సీఎల్పీ నేత చర్చించారు.

తాను సూచించిన వారికి పీసీసీ లో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని భక్టి విక్రమార్క ప్రశ్నించినట్టు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కు పీసీసీలో పదవులు కల్పించకపోవడంపై ఆయన ఠాగూర్ ను ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా నుండి మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టిన విషయాన్ని  ఠాగూర్ గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి పీసీసీలో ప్రాతినిథ్యం గురించి ఆయన చర్చించారని సమాచారం.

పీసీసీకి కొత్త బాస్ గా రేవంత్ రెడ్డిగా నియమించడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన అసంతృప్తిని ఆయన మీడియా వేదికగా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించిన తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మౌనంగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఆయను అధిష్టానం నుండి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే సోనియా, రాహుల్ గాంధీ ఆమోదంతోనే కమిటీని ప్రకటించిన విషయాన్ని ఠాగూర్  సీఎల్పీ నేత దృష్టికి తీసుకొచ్చారు.

click me!