కాంగ్రెస్ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డితో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఇవాళ భేటీ అయ్యారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు మహేశ్వర్ రెడ్డితో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డితో గురువారంనాడు సమావేశమయ్యారు. ఇవాళ భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభానికి ముందు నిర్మల్ లోని మహేశ్వర్ రెడ్డి ఇంటికివెళ్లారు భట్టి విక్రమార్క. మహేశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు.
మహేశ్వర్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించిన నాలుగు రోజులకే ముగించారు. తన పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేయాలని ఆదేశించడంపై మాణిక్రావు ఠాక్రేపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయమై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఠాక్రేకు లేఖ రాశారు మహేశ్వర్ రెడ్డి.
undefined
తొలుత మల్లుభట్టి విక్రమార్క ,మహేశ్వర్ రెడ్డి సంయుక్తంగా పాదయాత్ర చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కానీ మహేశ్వర్ రెడ్డి ఒక్కరే పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించిన నాలుగు రోజులకే మహేశ్వర్ రెడ్డి యాత్రను ముగించాల్సి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా నుండి భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించనున్నారు. దరిమిలా మహేశ్వర్ రెడ్డితో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామం నుండి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించనున్నారు. 91 రోజుల పాటు భట్టి విక్రమార్క పాదయాత్రను నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా వరకు విక్రమార్క పాదయాత్రను నిర్వహించనున్నారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా కలిసి పాదయాత్రలో పాల్గొనాలని భట్టి విక్రమార్క కోరారు. పాదయాత్రపై భట్టికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలు సూచనలు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన మేడారం నుండి రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు . రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. 50 రోజుల పాటు 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనుంది.
also read:రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ : సీఎల్పీ నేత భట్టి సహా పలువురి అరెస్ట్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు హత్ సే హత్ జోడో అభియాన్ కింద పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే భట్టి విక్రమార్క ఇవాళ పాదయాత్రను చేపట్టనున్నారు.